Sunday, February 15, 2026

Creating liberating content

Uncategorizedభారత జాతికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించిన మహనీయుడుకి ఘన నివాళి

భారత జాతికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించిన మహనీయుడుకి ఘన నివాళి

నివాళులర్పించిన ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి

పులివెందుల టౌన్
భారత జాతికి స్వేచ్ఛ స్వాతంత్రం అందించి భారత జాతికి జాతిపిత గాంధీ అయ్యాడు అని పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ రెడ్డి పేర్కోన్నారు. మంగళవారం పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి టిడిపి నాయకులతో కలసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం సాధించిన వారిలో గాంధీ ప్రథములు అని అందుకే దేశ ప్రజలు గాంధీ ని జాతిపిత అని పిలుస్తారు అన్నారు. అంతే కాదు సత్యము, అహింస గాంధీ నమ్మిన ఆయుధాలు అని ఇప్పుడు యువత గాంధీ మార్గం లో నడిచి దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు అన్నా రెడ్డి ప్రసాద్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి వెంకట్రామిరెడ్డి, మహబూబ్ బాషా, సిద్ధారెడ్డి, కాశీం , టిడిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article