— ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ వినూత్నప్రదర్శనలు.!
చంద్రగిరి :చంద్రగిరి స్వర్ణముఖి నది తీరాన ఉన్న బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో బుధవారం సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైన్స్ డే సందర్భంగావిద్యార్థులప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
చంద్రగిరిలో ఉన్న బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో రెండవ తరగతి నుంచి, పదవ తరగతి వరకు విద్యార్థులు తమ నైపుణ్యం ప్రదర్శించి సైన్సును కళ్ళకు కట్టినట్టు చూపించారు. శరీర భాగాలు, వాటి ఆకృతులు, నేటి సమాజంలో అత్యంత విలువైన వస్తువుగా పరిగణిస్తున్న సెల్ ఫోన్లు, అవి పని చేసే విధానం, వాటి వల్ల సమాజానికి ఉపయోగం, జంతువులు, వాటి శరీర ఆకృతులు, పూర్వకాలంలో టెలివిజన్ లు, రేడియోలు, వాటి పనితనం గురించి కళ్లకు కట్టినట్లు ప్రయోగాలు చేసి విద్యార్థులు చూపించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు చేసిన ప్రయోగాలను చూసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ హితేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ సైన్స్ డే జరిగిపోయిన, ఆలస్యంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే సైన్స్ డే నిర్వహించామన్నారు. విద్యార్థులు తమకు ఇష్టం వచ్చిన ప్రయోగాలను చేసుకురావాలని తెలిపామని, వాళ్ల ప్రతిభ వెలకట్టలేనిదని ఆయన వెల్లడించారు. ఉత్తమంగా ప్రయోగాలు చేసిన పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, సుమతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.