-టీడీపీలో చేరకపోతే ఇంటితో పాటు పొలానికి రస్తా లేకుండా చేస్తామంటూ వైసీపీ కార్యకర్తలకు బెదిరింపులు
-ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది: మక్బూల్
కదిరి :గత మూడు రోజుల క్రితం గాండ్లపెంట మండల పరిధిలోని గాజులవారిపల్లి పెద్దతండా పంచాయతీకి చెందిన బి. బిప్లా నాయక్, ఈ. రామ్లా నాయక్ లను స్థానిక టీడీపీ నాయకులు భయపెట్టి బలవంతంగా తమ మెడలో వారి పార్టీ కండువా వేశారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.యస్. మక్బూల్ అహ్మద్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కదిరి పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మక్బూల్ సమక్షంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. “వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తలుగానే కాకుండా వార్డు మెంబర్లుగా పనిచేసిన తమను టీడీపీ నాయకులు ఇంటితో పాటు మా పొలాలకు దారి లేకుండా చేస్తామని బెదిరించి బలవంతంగా పార్టీ కండువా కప్పారు. స్వతహాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేము ఇలా వారి పార్టీలో చేరడం ఇష్టం లేక తిరిగి నేడు మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తాం. బ్లాక్మెల్ చేస్తే బెదిరేదే లేదు” అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ తమ కార్యకర్తలను భయపెట్టి బెదిరింపులకు పాల్పడి వారి పార్టీలో చేర్చుకోవాలనే దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మరోసారి ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్ నాయక్, జై జవాన్ జై కిసాన్ ఆంజనేయులు నాయక్, తిమ్మప్ప నాయక్, రాంప్రసాద్ నాయక్, శ్రీనివాసులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.