Monday, May 5, 2025

Creating liberating content

తాజా వార్తలుబ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు మొదటి రోజు సందర్బంగా బ్రహ్మంగారిని దర్శించిన ఎమ్మెల్యే

బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు మొదటి రోజు సందర్బంగా బ్రహ్మంగారిని దర్శించిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

బ్రహ్మంగారి మఠం

బ్రహ్మంగారి ఆరాధన గురుపుజా మహోత్సవాలలో బాగంగా మైదుకూరు శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం విచేయగానే బాణ సంచాలతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.అక్కడ నుండి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దర్శనం మంగళ వాయిద్యాల, వేదపండితులు నడుమ మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజి, మేనేజర్ ఈశ్వరయ్యp ఆచారి,వెంకటాద్రి స్వామి,దత్తాత్రేయ స్వామి స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం గోపుజా నిర్వహించి వేద పండితులు ఆశీర్వదించి తీర్ద ప్రసాదాలు అందించేశారు. అనంతరం జగన్మాత ఈశ్వరిదేవిని దర్శించి మఠాది పతి శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వాముల వారితో మఠం ఆరాధన మహోత్సవాల అభివృద్ధి పనులగురించి చర్చించారు. అనంతరం
బ్రహ్మంగారి మఠం (పెద్ద మఠం & పోలేరమ్మ గుడి) నందు దాదాపు 3 కోట్ల 40 లక్షల రూపాయలతో (మఠం ప్రాకారపు నిర్మాణము, కల్యాణ మండపం నిర్మాణము, టీటీడీ సధనము నందు CC ఫ్లోరింగ్, శ్రీ పోలేరమ్మ గుడి నందు టాయిలెట్ బ్లాక్, శ్రీ పోలేరమ్మ గుడి నందు ఫ్లోరింగ్) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరియు ఆరాధన సందర్బంగా టిడిపి నాయకులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, కానాల మల్లికార్జున్రెడ్డి,ఎల్లటూరు సాంబశివారెడ్డి, పూజ శివయ్య యాదవ్, ఎత్తపు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి నీళ్లు పంపిణీ చేసే కార్యక్రమం ను ప్రారంభించిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్.ఈ కార్యక్రమాలలో మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు పోలీరెడ్డి, ఎస్ ఆర్ శ్రీనివాసులరెడ్డి,మరియు నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article