విశాఖ: విజయనగరం జిల్లా లో పర్యటన కు విచ్చేసిన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ని విశాఖ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఇల్లాపు వెంకట్ జగన్ ఆధ్వర్యం లో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం లో పుష్ప గుచ్చం అందించి గజ మాలతో ఘన స్వాగతం పలకడం జరిగింది. అనంతరం రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలుపు కోసం యువజన విభాగం ఏ మెరకు బోలపేతం కాబడింది అని వెంకట్ జగన్ ని బైరెడ్డి అడుగగా ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఆరు నెలల ముందు నుంచి నియోజకవర్గం లో సమావేశాలు ఏర్పాటు చేసి యవకులకు దిశా నిర్దేశం చేసి విది విధానాలు పై అవగాహన కల్పించి పటిష్టమైన విధంగా బలోపేతం చేయడం జరిగింది అనితెలిపారు. యువతరం అంతా సంసిద్ధం గా ఉందని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా రాబోయేది వైసిపి ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కలయిక లో ఉమ్మడి విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు, విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ళ శివ గణేష్, విశాఖ జిల్లా యువజన విభాగం ఉపాద్యక్షులు బింగి హరి కిరణ్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి రాంభుక్త ప్రభాకర్ నాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాగం స్వాతి సుధాకర్, కొంకి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
