*ఆడ జన్మకే అసహ్యం పుట్టేలా
*మొదట ప్రేమ ఆపై పెళ్ళిళ్లంటూ పలుకులు…
*ఒకడు ఉండగా మరొకరితో రహస్య సరస సల్లాపాలు..
*వయస్సు తో సంబంధం లేదు ..
*వయ్యారాల కోసం ఎవడైనా సరే…
*వాడుకోవడం వదిలివేయడం వెన్నతో పెట్టిన విద్య…
*మాటలు చుస్తే మాయలో పడని వాడుండడు..
*చేస్టలు చూశాక చావు బ్రతకులో కొట్టుమిట్టాడాల్సిందే..
*కారు కోసం ఒకడు..షికారు కోసం ఒకడు..చిత్రాల కోసం ఇంకొకడు..
*మామిడి తోటలోని ఇంటిలో మాయ వేషాలు..
*అవర్ ప్యాలస్,లోటస్,స్వర్ణ ప్యాలస్ బాపట్ల బీచ్ ఇలా..
*తల్లే దగ్గరుండి తల దిండు అందిస్తుంటే…
*అసలు మొగుడికి అనుమానం రాకుండా..
*అసలైన అల్లుడికి అత్తగారే అబద్ధపు కూతలు కూస్తూ..
*కొత్త అల్లుళ్ల కోసం కూతుర్ని ప్రోత్సహిస్తుంటే…
*కాసుల కోసం కన్న కూతురి కాపురాన్ని కూల్చిన కసాయి తల్లి…
*క్వార్టర్ కోసం కట్టుకున్న భార్య, కూతురుకి కాపలాగా ఉండే ఓ తండ్రి…
*కామం, కాసుల కోసం ఎన్ని కంఠాలను కోయడానికయిన వెనుకాడకుండా …
*ఓ కోయిల ఇంకెన్ని కొత్త అవతారాలెత్తుతావే..
ఇదొక అంతుచిక్కని కథ
“అర్థాతురాణాం న గురుర్న బంధుః, కామాతురాణాం న భయం న లజ్జా, విద్యాతురాణాం న సుఖం న నిద్రా, క్షుధాతురాణాం న రుచిర్న పక్వం”, దీని భావం “ధనాశాపరులకు గురువు, బంధువుల పట్టింపు ఉండదు, కామంతో ఉన్నవారికి భయం, సిగ్గు ఉండవు, విద్యను అభ్యసించేవారికి సుఖం, నిద్ర ఉండవు, ఆకలితో ఉన్నవారికి రుచి, ఆనందం ఉండవు. కామాతురాణాం న భయమ్ న లజ్జ…శరీరాన్ని కోరిక దహించివేస్తుంటే మనిషి ఉచ్ఛనీచాలు చూడరు. వావివరుసలుపట్టించుకోరు.సిగ్గు,భయం,గౌరవమర్యాదలు ఇవేవీ వారు లెక్కించరు. వారి లక్ష్యం …కోరుకున్న ది మాత్రమే! అది పొందడం కోసం ఎంతకయినా తెగిస్తారు.
పొట్టకూటి కోసం పరుల పంచన చేరే పడతి తన శీలసంరక్షణ కొరకు ఎన్ని పాట్లు పడాలో ఆ భగవంతుడికే ఎరుక! …..కాస్త రాజీపడితే పోలా! శీలమేమిటి! అదెట్లా ఉంటుంది! అని అనుకునేవారికి ఫరవాలేదు!
కానీ తన భర్తను మనసా,వాచా,కర్మణా మోసం చేయరాదు అని దృఢసంకల్పంతో ఉన్న స్త్రీ కి మాత్రం అది ప్రత్యక్ష నరకమే! శరీర ఆకృతిని బట్టి పద్మిని, చిత్రిణి, శంకిణి, హస్తిణి అను స్త్రీ జాతులను కళ్యాణమల్లుడు అద్భుతంగా వర్ణించాడు ఇవన్ని వేదాలలో చెప్పబడినవి.త్రేతాయుగం,ద్వాపరయుగం,కృతయుగం నుండే వివాహేతర సంబంధాలు ఉండేవి.ఆనాడు ఇంత పరిజ్ఞానం లేదు కాబట్టి అంతగా ప్రాచుర్యం లోకి వచ్చేవి కావు.కానీ నేడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడ జరిగిన జన బాహుళ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ప్రధాన అంశమేమిటంటే.. బెజవాడ బేబీ తీరు ఎవరీ బెజవాడ బేబీ అనుకుంటూ ఉండచ్చు.ఈ బెజవాడ బేబీ ఆ రంగంలో అందరికి సుపరిచుతురాలె. అందరిలో కొందరిని దరిచేర్చుకుని వారి దాహాన్ని తీర్చినదే. ప్రస్తుతం తీరుస్తూ ఉన్నదని అనుకుంటూ ఉన్నారు కొందరు.అదెంత వరకు నిజమే ఆలోగుట్టు పెరుమాళ్ళ కెఱుక.
అయితే ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ బెజవాడ బేబీ దేనికోసం ఇలా చేస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది. డబ్బు కావాలా అంటే డబ్బు కోసం అనేక మార్గాలు ఉన్నాయి.కాకి బంగారం వేసుకుని లోన ఉన్న వాడి కంపును అలా ఉంచుకోని వాడి కొంపను గుళ్ల చేసుకుంటూ ఈ కొంపలో బడి ఇల్లు కావాలా,కారు కావాలా అంటూ కాపలా కుక్కలా పచ్చనోట్ల కట్టలున్న బ్యాగ్ ను మరీ చేతికిచ్చి అల్లారు ముద్దుగా ప్రేమికులకంటె ఎక్కువ ఎగిరిపోతే ఎంత బాగుంటుందని వయస్సుతో సంబంధం లేకుండా బేబీ వయ్యారాల వడిలో వాలిపోయి తులిపోయేవాడు. కానీ ఆ రాళ్లలో రంగు రుచి లేదని తెలిసిందో ఏమో కాకిబంగారంను కాలితో తన్ని వేసింది. వాడేమో నేనే తన్ని తరిమివేసా అని అందరికి చెప్పుకు తిరుగుతూ కారులో జరిగిన జరగని కామ కళాపాలను కావ్ కావ్ మంటూ కాకిలా అరుస్తూ లోన విలపిస్తూ తనని కాదన్నదని చివరకి విషం త్రాగి తన తనువు చాలించేందుకు కూడా సిద్ధపడినట్లు వాట్సప్ లో పంపినా ఈ బేబీకి ఇలాంటి వి కొత్తకాదు కాబట్టి కిమ్మని అనకుండా తన చీకటి కలల కోసం అందరిని చీకటిపాలు చేయడమే పనిగా పెట్టుకుంది. ఇలా జరుగుతున్న నేపధ్యంలో ఒక నాడు జరిగిన విషాద సంఘటన గురించి బైటికి రాలేనంటూ విషపు గుళికలను మన చెంత ఉంచుకుని ఆ విషాదం చాటున ఎన్నో మరెన్నో చిత్ర విచిత్ర మైన వేషాలు వేస్తూ..
“కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే
రాతిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే
తెల్లవారే ఎదురైవస్తే జారుకుంటావే
ఊరించకే ఊరించకే ఆ కొంటె చూపుతోటి నన్ను చంపకే
కవ్వించకే కవ్వించకే నీ నవ్వు తోటి మాయ చెయ్యకులే చెలికాడ
కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే”అంటూ వలపుల మాటలు చెప్పడం మొదలు పెట్టింది.ఇలా చీకటి బ్రతుకని తెలియక చితికి చేరిన వాడి చితి ఆరాక ముందే చిలిపి ప్రియుడితో చెట్టా పట్టాలేసుకుని
“హే పట్టు చీరనే గట్టుకున్నా గట్టుకున్నుల్లో గట్టుకున్నా
టిక్కి బొట్టె వెట్టుకున్నా వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా ప
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని అందాల దునియానే సూపిత్త ప
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనినే అవ్వసాతు ఆడపిల్లనయ్యో పిల్లనయ్యో ఆడపిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో
ఏడూ గడపల్లో ఒక్కడన్నీరయ్యో దన్నీరయ్యో ఒక్కడన్నీరయ్యె”అంటూ పుండు పుట్టిన వాడితో ప్రేమాయణం సాగించింది.ఈ ప్రేమికులు వరుసలు చూస్తే వీధి కుక్కలు చాలా మెలేమో అనిపిస్తాయి.ఈ బేబీ చేతిలో చితికి పోయిన వాడు రంగురాళ్ల లోడికి కొడుకు లాంటి వాడు,పుండు పుట్టిన వాడు బావ అపుడు ఈ బేబీ ఒకడికి కోడలు ఒకడికి చెల్లి.కానీ ఇద్దరూ ఈ బేబీతో
“జలకాలాటలలో కలకల పాటలలో
యేమి హాయిలే హలా… అహ యేమి హాయిలే హలా
జలకాలాటలలో కలకల పాటలలో
యేమి హాయిలే హలా… అహ యేమి హాయిలే హలా
ల ల లా ల లా..లలలాలాల లా లా లలా”అంటూ సరసలాటలలో మునిగి తేలిపోయారు.మరి వీరి పవిత్రమైన అక్రమ బంధానికి ఏ పేరు పెట్టాలో ఆ అపివి త్రులకే తెలియాలి. ఇలా సాగుతున్న ప్రయాణంలో పుండుపుట్టిన వాడికి తీరని కోరిక,చెరగని అనుమానం పుట్టి చివరికి పూట పూటకి అన్నం పెట్టి ఎంతో పవిత్రంగా చూసుకున్న ఓ పడతిని కాదని అన్నం పెట్టిన ఆడదాన్ని పొట్టకొట్టాలనే సిగపట్లు పట్టేలా చేసి పరువు తక్కువ పనికి పాల్పడి చివరికి బేబీతో రహస్య మిత్రుడు గా ఉంటూ ఉండగా ఈ బేబీ కొత్త అవతారమెత్తి అబద్ధాల కథలు అల్లడం మొదలు పెట్టింది. అలా అల్లిన కథలో ఒక కొత్త అల్లుడిని పరిచయం చేసింది అమ్మకు ఈ బేబీ.అయితే తల్లే సొంత అల్లుడికి సాకులు చెబుతూ కొత్త అల్లుడితో కూతురు కామ కళాపాలకు కాపలాగా ఉంటూ కంటికి రెప్పలా కూతురి కామ క్రీడలను ప్రోత్సహించింది.ఆ తల్లి లాంటి ది ఈ భూమిమీద ఇక ఉండదేమో అనిపిస్తుంది.గాడి తప్పిన కూతురి కుటుంబాన్ని కాపాడాల్సిన కన్న తల్లే కూతురి కామ క్రీడలకు అండగా ఉండి మొగుడుని ముండగా చేసి తన కూతురు కామం ,వ్యామోహం, కలల కోసం ఎన్ని కాపురాలు పోయిన ఫర్వాలేదని దగ్గరుండి షికార్లకు పంపిస్తున్న ఇలాంరి కంత్రి తల్లిని ఏ కఠిన శిక్ష వేసిన సరిపోదన్నది అక్షర సత్యమని చెప్పాలి. ఇవన్నీ కళ్ళముందు జరుగుతున్న క్వార్టర్ వేసుకుని కూని రాగాలు తీస్తూ కట్టుకున్న పెళ్ళాం,కన్న కూతురి లీలలు చూస్తూ కునుకు తీస్తున్న ఆ కన్న తండ్రీ లాంటి వాడు ఈ లోకం లో అరుదుగా ఉంటారని అనుకోవాలి. తమ కూతురే కంత్రిదని తెలిసి కూడా కూతురి కాపురంలో నిప్పులు పోసి బంగారం లాంటి బుడ్డ పిల్లల్కి అసలు తండ్రి ఉన్నా కొత్తగా ఎందరు తండ్రులో తెలియని విదంగా చేస్తూ ఈ తల్లి కూతుళ్ళ కథలు పురాణాల్లో కూడా లేవేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కథలో ఇంకా చాలా వివరాలు ఒక్కొక్కటిగా బైటికి వస్తుంటే వీరిది ఆడ జన్మ నేనా అన్న సందేహం కలుగుతోంది…
మిగిలిన భాగం..వచ్చే సంచికలో….