Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుబెజవాడపశ్చిమ చూడతరమా..

బెజవాడపశ్చిమ చూడతరమా..

ఆ స్క్రిప్టే వేరబ్బా..
ఇదే సరియైన రాజకీయమంటే.
ఆశీఫ్ కు అవకాశం ఇచినట్లే గానీ…
సుజనా గెలుపుకు లేదు ధీమా
ఆ కార్పొరేటర్లకు పండగే పండగ…
రోజుకు మూడు లక్షలు .ఓ లచ్చ జేబులోకి…
కూటమితో భలే బేరం…
ఒక్కొక్కరికి కోటీ…కండువా వైసీపీదే…
కోట్లు కుమ్మరించే వెలంపల్లి కి స్థానాచలనం…
కాసుల్లేని నేతకు కమ్మటీ అవకాశం…
ఇదే ఇక్కడి కమ్మటీ రాజకీయం… అదే జగన్మోహనుడి రాజకీయ చతురత…

ప్రజాభూమి ప్రధానప్రతినిది, అమరావతి:

ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి.వైసీపీ అధినేత వైనాట్ 175 అన్న కొత్త అంశం తెరమీదికి తెచ్చాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అందరూ అనుకున్నారు. ఆయనకు ఆశయం ఉంది అయితే కొంత సర్దుబాటుకు ఒప్పుకోక తప్పడం లేదన్న కొత్త వాదన తెరమీదికి వచ్చింది.ఓ వైపు ఒక్కడు మరోవైపు కూటమి పోటీలో ఉన్న బీజేపీ నుంచి బరిలో అభ్యర్థులు గెలుపుకు జగన్ ఒప్పుకోక తప్పలేని పరిస్థితి ఏర్పడిందన్న కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. అయితే ఇందులో వైసీపీ నేతలు రెండు విధాలుగా లాభపడి పోతున్నారు.బెజవాడ పశ్చిమలో పలు ఆసక్తికర అంశాలు తెలియవస్తున్నాయి.ఇక్కడ కూటమి అభ్యర్థి గా బీజేపీ నుంచి యలమంచిలి సత్యనారాయణ అలియాస్ సుజనా చౌదరి భరిలో ఉన్నారు.వైసీపీ నుంచి ఆశీఫ్ బరిలో ఉన్నారు. అయితే సుజనాతో పోల్చితే ఆశీఫ్ కాసుల విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందనేది జగమెరిగిన సత్యం. మొదట జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానివెనుక బలమైన కారణం ఉంటుంది పార్టీ నే అంతా భరించి ఆశీఫ్ ను అసెంబ్లీకి రప్పిస్తారని అనుకొన్నారు.సామాజిక, రాజకీయ సమీకరణాలలో భాగంగా వెలంపల్లి ని సెంట్రల్ కి మార్చినట్లు అందరూ అనుకొన్నారు. కానీ ఇది బీజేపీ మైన్డ్ గేమ్ అన్నది ఆలస్యంగా తెలుస్తోంది. పార్టీ ని ఆర్థికంగా సఫార్ట్ లేకపోవడంతో వైసీపీ అభ్యర్థి కోట్లుకొల్లగొట్టిన కార్పొరేటర్ లను కొంత ఆర్థిక సహకరించాలని కోరినట్లు మొదట్లోనే గుసగుసలు వినిపించాయి.అయితే ఇందుకు ససేమిరా అన్నకొంతమంది కార్పొరేటర్ కూటమి అభ్యర్థి తో టచ్ లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తొంది.అక్రమ నిర్మాణాల విషయంలో దండుకోవడం లో ఆరితేరిన వీరు ఎదురు ఖర్చు చేస్తారను కోవడం ఎంత గ్రహాపాటో ఆశీఫ్ కు ఆలస్యంగా అర్ధమయిందన్న విషయాలు కూడా తెలియవస్తున్నాయి.ఓ బిల్డింగ్ నిర్మాణ విషయంలో ఓ కార్పొరేటర్ తీరుతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోబోయాడన్న విషయం కూడా అప్పట్లోపెను దుమారమే లేపింది. అలాంటి పరిస్థితిల్లో ఆర్థికంగా అండ దండలు ఇస్తారను కోవడం కూడా అమాయకత్వమే అవుతుంది.
ఇందుకు గల కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వైసీపీ అధినేత ఒకసారి గెలిచి పదవిలో ఉన్నవారికి మళ్లీ సీటు ఏదయినా ఇస్తారో లేదో అన్న నమ్మకం కూడా ఉండటం లేదుగా.జగన్మోహనుడి తీరే వేరుకదా. గతరాజకీయాల్లో ప్రజల్లో ఉన్నా లేకపోయినా కార్పొరేటర్ స్థాయి ఆపై స్థాయి నేతల వరకు సీట్ల విషయంలో డోకా ఉండేది కాదు.కానీ జగన్మోహనుడు కొత్త రకం రాజకీయాలకు తెరలేపారుగా.కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న పాత సామెతను నేటి నేతలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు తప్పదు మరి.ఈ నేపధ్యంలో బెజవాడ పశ్చిమలో అంచనాలు తారుమారు అయ్యి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.చూడాలి మరి ఏమి జరుగుతుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article