టిడిపి రాష్ట్ర నాయకుడు హరిప్రసాద్
కడప అర్బన్
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీ నే, బడ్జెట్ అంచనాలు కొండంత, ఖర్చులు ఇసుమంత అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ బడ్జెట్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హరి టవర్స్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ, 13 వేల కోట్ల రెవిన్యూ లోటును, రూ, 44 వేల కోట్లకు, రూ, 35 వేల కోట్ల ద్రవ్య లోటును రూ, 60 వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదేనని అన్నారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. ఏపీ అప్పుల్లో అగ్రగామిగా ఉందని, మద్యం బాండ్లు రూ,16,000 కోట్లు. కార్పొరేషన్ హామీలు రూ, 1,10,603 కోట్లు. కార్పొరేషన్ తన ఖాళీలు రూ, 94, 928 కోట్లు. డిస్కం బకాయిలు రూ, 27, 228 కోట్లు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు రూ, 95, 400 కోట్లు వైసిపి పాలనలో రెట్టింపు అయిన ఏపీ అప్పుల వివరాలను లెక్కలేసి చెప్పుకొచ్చారు. వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సీము ఓ స్కామ్ గా మారిందని విమర్శించారు. విద్యుత్ చార్జీలు ఏడుసార్లు పెంచి, అది చాలదన్నట్లు సర్ చార్జీలు పేరుతో వినియోగదారులపై శనివారం పడిందన్నారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లో రూ, 1000 కోట్లు అవినీతి జరిగిందని, బడులకు వేసిన రంగుల్లో మూడు కోట్లు అవినీతి జరిగిందని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో నిధులు అంతంత మాత్రమేనని, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ఈ సర్కార్ రద్దు చేసిందని, ఇంటర్ విద్యార్థులకు భోజనం నిలిపి వేసిందని ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. 35 లక్షల పొదుపు గ్రూపులకు బడ్జెట్లో మొండి చేయి అని, ఆక్వా రంగాన్ని అదో పాతాళానికి తొక్కారని, సబ్ ప్లాన్ నిధులు రూ, 75 వేల కోట్లు దారి మళ్లించి 30 పథకాలు ఈ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో, దుష్ట శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, రాజకీయ పార్టీల నాయకులు ప్రశాంత ఎన్నికలకు విలువివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాంప్రసాద్, బలిజ సంఘం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.