Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుబుగ్గన బడ్జెట్ అంతా అంకెల గారడీ జ్యోతుల నెహ్రూ

బుగ్గన బడ్జెట్ అంతా అంకెల గారడీ జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైసిపి ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేయడానికి మరొక అంకెల గారడి బడ్జెట్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారని జగ్గంపేట మండలం ఇర్రి పాక శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండంత బడ్జెట్ అంచనాతో కేటాయించేది గోరంత అని 13 వేల కోట్ల రెవెన్యూ లోటును 44 వేల కోట్లకు, 35వేల కోట్లకు ద్రవ్య లోటును 60 వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదేనని ఆయన ఎద్దేవా చేశారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు లేవని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పు 11.58లక్షల కోట్లకు చేరిందని అన్నారు. మద్యం బ్రాండ్ల ద్వారా 16000 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ హామీలు 1,10,603 కోట్లు అని, కార్పొరేషన్ తనకాలు94,928 కోట్లు అని కాంట్రాక్టర్ లకు పెండింగ్ బిల్లులు 95,400 కోట్లు అని ఈ ప్రభుత్వ పాలనలో ఇవన్నీ రెట్టింపు అయ్యాయని నెహ్రూ అన్నారు. 2019 టిడిపి ప్రభుత్వం తీసుకున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా జగన్ అండ్ కో మార్చింది అన్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి స్కీము ఒక స్కామ్ గా మారిందని అన్నారు. ఈ ప్రభుత్వంలో ధరలు పెరిగాయని, ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పడిందని రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా విపరీతంగా పెరిగినవి అన్నారు. విద్యార్థులకు అందించిన ట్యాబుల్లో కూడా 1000 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. నాడు నేడు పేరుతో పాఠశాలలకు రంగులు వేసి మూడు వేల కోట్లు దోచేసారని అన్నారు. మద్యం పై వస్తున్న ఆదాయంతో ఈ జగన్ ప్రభుత్వం నడుస్తుందని, అదే నాసిరకం మద్యంతో 30 వేల మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైసీపీ సర్కార్ ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పి నిధులు అంతంత మాత్రమే కేటాయిస్తుందని అన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను సైతం రద్దుచేసిందని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దుచేసిందని, 35 లక్షల పొదుపు గ్రూపులకు బడ్జెట్లో మొండి చేయి చూపిందని, రైతు భరోసా ఇచ్చే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గించిందని, 0 వడ్డీ పంట రుణాలను ఐదు లక్షల నుండి మూడు లక్షల కుదించిన ప్రభుత్వం, కులవృత్తుల వారిని మరిచిపోయి వారికి పూర్తిగా మొండి చేయి చూపించిందని అంకెల గారడీతో ఎన్నికల్లో లబ్ధి పొందిదామని చూస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని జ్యోతుల నెహ్రూ తీవ్రంగా విమర్శించారు.ఈ కార్యక్రమంలో కోర్పు సాయి తేజ, కన్నబాబు, అడపా భరత్, ఏలేటి బాబి, జాస్తి వసంత్, ముత్యాల వీరభద్రరావు, బొండా శ్రీను బాబు, గొల్లవిల్లిఅప్పలరాజు, గల్లా రాము విజయ్, ముత్యాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article