- బీసీ మండల ప్రధాన కార్యదర్శి డక్కారమేష్
వేంపల్లె :రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ బీసీ మండల ప్రధాన కార్యదర్శి డక్కారమేష్ తెలిపారు. ఆదివారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసిల పార్టీ, టిడిపి పుట్టిందే బీసీల కోసమని, ఆర్థికాభివృద్ధికీ ఎంతగానో కృషి చేసిందన్నారు. దివంగత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసిలకు పెద్దపీట వేసి, సముచిత న్యాయం, స్థానం కల్పించారన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదగాలనేదే టిడిపి లక్ష్యమని, అందు కోసం బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. ఆ పార్టీకి వెన్నెముక బీసిలే అన్నారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలకు ఆదరణ కరువైందన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు బీసీ సోదరులంతా ఐక్యతతో కృషి చేయాలని కోరారు. టిడిపి అధికారంలోకి వస్తే బీసిలకు రక్షణ చట్టం అమలు చేయడం జరుగుతుందన్నారు.బీసీల సంక్షేమాభివృధ్ధి తెలుగుదేశం పార్టీతోనేనని అభిప్రాయపడ్డారు.