వి మాడుగుల మండలం లో
బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాస్తున్న, కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని సిఐటియు మండల నాయకులు ఇరట నరసింహమూర్తి ఆర్ దేముడు నాయుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కార్లి భవాని మాడుగుల మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ
2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకుండా కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని వారు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఒకవైపున పెట్రోల్ డీజిల్, గ్యాస్, ధరలను విపరీతంగా పెంచేసి, ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వ్యాపారస్తులకు కార్మికుల అందరిని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చారని అన్నారు.
అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చారన్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు 50 శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, కేరళ రాష్ట్ర విధానాన్ని అమలు చేయాలని అన్నారు.
రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రుణ ఉపశమన చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు పెంచి, వేతనం 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు
ఆర్. రామలక్ష్మి. ఎన్. కొండాజి. బి. ఉమాదేవి. జి.సరోజిని. వి. ధనలక్ష్మి. కాంగ్రెస్ పార్టీ మాడుగుల నియోజకవర్గ కోఆర్డినేటర్ పడాల కొండలరావు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యం.యేసు రాజు,తదితరులు పాల్గొన్నారు.