Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుబి ఎం ఎస్ చట్టాన్ని రద్దు చేయాలి

బి ఎం ఎస్ చట్టాన్ని రద్దు చేయాలి

లంకెలపాలెం
లంకెలపాలెం పరవాడ రోడ్ లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారుబిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాస్తున్న, కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని , మోటార్ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బి ఎం ఎస్ భారత న్యాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు .సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ లో ప్రదర్శన చేపట్టారు. ఈసంద ర్భం గా గని శెట్టి మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు నష్టదాయకమైన ఉరుతాడు లాంటి బి ఎం ఎస్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకుండా కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని వారు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఒకవైపున పెట్రోల్ డీజిల్, గ్యాస్, ధరలను విపరీతంగా పెంచేసి, ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే దేశ సంపదను అంబానీ, అదాని వంటి కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా దోచిపెడుతుందని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు కల్పించిన నరేంద్ర మోడీ రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికుల హక్కులను కాల రాశారని ఆయన మండిపడ్డారు. అదానీ అంబానీలను కుబేరులను చేసి, రైతులను వ్యవసాయ కార్మికులను అప్పులు పాలు చేశారని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చారని అన్నారు. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చారన్నారు. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. నిరంకుశ పరిపాలన సాగిస్తున్న కేంద్ర బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం అవ్వాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు సీ టు 50 శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, కేరళ రాష్ట్ర విధానాన్ని అమలు చేయాలని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రుణ ఉపశమన చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు పెంచి, వేతనం 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కే వెంకట్రావు, ఆటో యూనియన్ నాయకులు అప్పలరాజు నాయుడు రామారావు, ముఠా సంగ నాయకులు డి దేముడు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article