వి.ఆర్.పురం
నల్ల చట్టాలను అమలు చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేఖపల్లి జంక్షన్ వద్ద బిజెపి మతోన్మాద, ప్రజావ్యతిరేక పార్టీని ఓడించాలని కార్మిక, కర్షక ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం తో పాటు సిపిఎం మండల మద్దతుతో కార్మిక, గిరిజన నాయకులు, కర్షక సంఘాల నాయకులు, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు రైతు సంఘ రాష్ట్ర సభ్యులు కుంజ నాగిరెడ్డి మాట్లాడుతూ 18నెలలపాటు దేశ రైతాంగం వీరోచిత పోరాటం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిందని గుర్తు చేశారు. రైతులు పోరాట ఫలితంగా వ్యవసాయ రంగంలో తీసుకుని వచ్చిన మూడు నల్లచట్టాలను బిల్లు ఆమోదం పొందిన అదే పార్లమెంట్ లో ఉపసంహరణ చేసుకునేలా రైతులు పోరాడి సాధించారని గుర్తు చేశారు. మరికొన్ని డిమాండ్ లను నేటికీ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర ప్రకటించాలనే కొన్ని డిమాండ్ లు అపరిష్కృతంగానే ఉన్నాయని, వాటి అమలు కోసం 16న గ్రామీణ బంద్, నిరసన నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఏడాది పాటు ఉద్యమంలో రైతు కుటుంబాలకు ఆర్ధికంగా సహాయం చేయాలని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక రంగంలో 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని బిజెపి ప్రభుత్వం వచ్చిన నాటినుండి అధిక ధరలు పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకులు పెరగడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని, వాటిని నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చటాన్ని కార్మిక సంఘాలు తిరస్కరించాయని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో బడా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు దోచిపెట్టేందుకే బిజెపి కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా అనేక కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అమలు చేసేందుకు, చట్టాల్లో మార్పులు చేస్తున్నారని నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. పోరాడే రైతులపై నిరంకుశంగా, అత్యంత దుర్మార్గమైన దమనకాండను సృష్టించుతుందని, ప్రజానీకం ప్రభుత్వ దాడులను తిప్పికొట్టాలని నేతలు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి వడ్లది రమేష్ సిపిఎం నాయకులు పంకు. సత్తిబాబు తాతబాబు లక్ష్మణరావు సోడి మల్లయ్య సిపిఎం సీనియర్ నాయకులు జిహెచ్ సుబ్బారావు గిరిజన సంఘ నాయకులు పూనం. ప్రదీప్ కుమార్ ఇతర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.