కూనవరం:
బిజెపి ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయాలని బిజేపి కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి నోముల రామరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం వెంకయ్య కోరారు.కూనవరం లో ఆయన మాట్లాడుతూ
ఈనెల 21 నుండి 29 వరకు విలీన మండలాల్లో బిజెపి అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అబివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరిస్తూ గ్రామ గ్రామానికి, ఇంటింటికి చేరువ చేస్తూ ఈ యాత్ర చేపట్టానున్నమని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 9 రోజులు నాలుగు మండలాల్లో జరుగుతున్న పోరు యాత్రను పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ మోర్చ కార్యదర్శి పంభి భుపేష్ పాల్గొన్నారు.