టి.నరసాపురం.
జబర్దస్త్ టీమ్, సినీ గాయకులతో కూడిన బృందం టి.నరసాపురం మండలంలోని పలు గ్రామాల్లో బిజెపి తరుపున ప్రచారం నిర్వహించి సందడి చేసింది. బుధవారం టి నరసాపురం మండలంలోని మల్లుకుంట, బొర్రంపాలెం, శ్రీరామవరం, టి నరసాపురం గ్రామాలలో పర్యటించి మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి, తపన ఫౌండేషన్ ద్వారా గారపాటి చౌదరి చేస్తున్న వివిధ సేవలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. జబర్దస్త్ కళాకారులు అదిరే అభి, అప్పారావు, బాబీ, వినోద్ (వినోదిని), ఇమ్మాన్యుయేల్ లు కామెడీ షోతో సినీ గాయని గాయకులు లాస్య ప్రియ, అరుణ్ కౌండిన్య లు సినీ పాటలు పడి స్థానిక ప్రజలను అలరించారు. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని కావడం బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని, తపన ఫౌండేషన్ ద్వారా 16 ఏళ్లగా ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత నిధులతో నిర్వహిస్తున్న బిజెపి నేత గారపాటి చౌదరినీ వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకుంటే డబుల్ ఇంజన్ అభివృద్ధి సాధ్యమవుతుందని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు.పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొడియం శ్రీనివాసరావు, టి.నర్సాపురం మండల అధ్యక్షులు మాలెంపాటి హరిబాబు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షురాలు కాంచనమాల నాయకులు జట్ల రాంబాబు రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.