దేశ అభివృద్ధి బిజేపి తోనే సాధ్యం పల్లెకు పోదాం లోకాజులూరు మండలం బిజెపి శ్రేణులు.
కాజులూరు
భారతీయ జనతా పార్టీ పల్లెకు పోదాం ముగింపు కార్యక్రమం కాజులూరు మండల అధ్యక్షులు సలాది వీరబాబు ఆధ్వర్యంలో కుయ్యేరు ,కోలంక గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు ,ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో బిజేపి శ్రేణులు మాట్లాడుతూ దేశం అభివృద్ది చెందాలంటే బిజేపి ప్రభుత్వం తోనే సాధ్య మౌతోందని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గావ్ ఛలో ఆభియాన్ (పల్లెకు పోదాం) కార్యక్రామంలో భాగంగా గ్రామాల్లో పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రజలకు వివరించారు. అలాగే ఆయా గ్రామాల్లో ఓటర్లు , కార్యకర్తలతో సమావేశమై స్ధానిక పరిస్ధితులపై సమీక్షించారు, అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తరాల భారతీయుల కల అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు సాటి చెప్పిన సందర్భంగా మోడీ కి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామసర్పంచుల ద్వారా తీర్మానాలు చేయించడం జరిగినది. అలాగే కుయ్యేరు ఉప్పుమిల్లి, కోలంక, పల్లి పాలెం ,రోడ్డు మీదుగా వాల్ రైటింగ్స్ వ్రాసారు దీంతో ఆయా చోట్ల వాల్ రైటింగ్స్ పై పలువురు ప్రశంసిచారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు తలాటం అమ్మాజి పల్లెకు పోదాం ప్రోగ్రాం కన్వీనర్ నిమ్మన రాజేష్ కోకన్దిన పినిపే సతీష్ చంద్ర ఐయితపూడి ప్రవాసి కార్యకర్త దేవు పట్టాభి మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి శ్రీనివాస్ పుణ్యమంతుల శివాజీ ఉపాధ్యక్షుల ఎస్వీ కృష్ణమాచార్యులు రొక్కాల సత్తిబాబు ,
గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు