కడప సిటీ:ఎంతోమంది బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని బాలికల అభ్యున్నతి ధ్యేయంగా బాలికల ఆశ్రమం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీదేవి తెలిపారు. బుధవారం కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఇందిరా నగర్ నందు చెన్నయ్య ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల ఆశ్రమం ప్రారంభోత్సవానికి ప్రముఖ డాక్టర్ శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఇద్దరు యువజంటలు సుబ్బనరసమ్మ, నాగేశ్వర్ రావు తాము చిన్నవయసులో పడిన కష్టాలు , ఎవరూ పడకూడదు అని , ఈరోజు ఒక బాలికల ఆశ్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, వారికి భవిష్యత్తులో మా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అనేకమందిపేద ప్రజలు, అనాధలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారానికి ఆశ్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. ఈ ఆశ్రమాలను అభాగ్యులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా సేవలు చేస్తున్న స్వచ్చంద సేవకులను గౌరవ అతిథులు మీదుగా మెమెంటో, షీల్డ్ ఇచ్చి సన్మానం చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో అశ్రమ నిర్వహకులు సుబ్బనర్సమ్మ, నాగేశ్వర్ రావు, అరుణ కుమారి,ప్రసన్న, రహమతున్నిష,ఈశ్వరయ్య, విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.