పుట్లూరు. పుట్లూరు మండలంలోని బాలాపురం గ్రామంలో మంగళవారం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైయస్సార్ హెల్త్ క్లినిక్ నందు సచివాలయ పరిధిలో ప్రజలకు వైద్య పరీక్షలు డాక్టర్ శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ బాలాపురం పంచాయతీలోని ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పరీక్షల అనంతరం వారికి కావాల్సిన టాబ్లెట్లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ గ్రామ పంచాయతీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డి ఆనంద ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వెంకట్ నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

