- జిల్లా టిడిపి అధ్యక్షుడు అంజినప్ప
హిందూపురం
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నుండి మూడోసారి పోటీ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను భారీ మెజార్టీతో హ్యాట్రిక్ ఇవ్వాలని ప్రజలకు శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప విన్నవించారు. అదేవిధంగా హిందూపురం పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా పోటి చేస్తున్న బికె పార్థసారథిని కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. హిందూపురం రూరల్ మండల పరిధిలోని వినాయక నగర్, కిరికెర తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారాన్ని సాగించారు. కిరికెర మాజీ సర్పంచ్ హెచ్ ఎన్ రాము, తెలుగు అధ్యక్షులు సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

