ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల తహశిల్దారుగా సరస్వతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న తహశిల్దార్ నాగేంద్ర చిత్తూరు జిల్లాకు బదిలీకాగా కడపజిల్లా కామలాపురంలో పనిచేస్తున్న సరస్వతి ముదిగుబ్బకు బదిలీ అయివచ్చినట్లు తెలిపారు. రైతులకు భూసమస్యలు ఉంటే ఎలాంటిపైరవీలు లేకుండా నేరుగా కార్యాలయ సమయంలో సందర్శించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలు, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటినిపరిష్కరిస్తూ కార్యాలయానికి నివేదించాలని సూచించారు. తహసిల్దార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండలంలో పనిచేస్తున్న పలు శాఖల అధికారులు మండల వ్యాప్తంగా సచివాలయాలలో పనిచేస్తున్న వీఆర్వోలు, విఆర్ఏలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.