పోరుమామిళ్ల:
విజయవాడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు బద్వేల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం వినతి పత్రం దాఖలు చేసినట్లు మాజీ ఎస్సీ నేషనల్ కమిషన్ నెంబర్ పీఎం కమలమ్మ తెలిపారు. రానున్న 2024 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తరపున బద్వేల్ ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ కోసం కమల్ ప్రభాస్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గతంలో వారు బద్వేల్ నియోజకవర్గ యువత ఇన్చార్జిగాను. పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.