పోరుమామిళ్ల:బద్వేలు వైయస్సార్ సిపి అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి సమక్షంలో శనివారం పోరుమామిళ్ళ టౌన్ వాస్తవ్యులు షేక్ పన్నెకట్ల భాషా, షేక్ హుస్సేన్ భాషా, షేక్ నంద్యాల మహబూబ్ బాషా, పన్నెకట్ల హాబీబుల్ల, పన్నెకట్ల షాకీర్, ఆయూబ్,మహబూబ్ బాషా, ఫిరోజ్, ఇస్మాయిల్ తదితరులను పార్టీ లోకి సాదరముగా విశ్వనాధరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగినది. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం లో ఎక్కడ చూసినా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు ముగ్ధులై స్వచ్ఛందంగా టిడిపి నుండి వైఎస్సార్సీపీలోకి భారీ సంఖ్యలో వలసలు రావడం శుభసూచకం అన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి డాక్టర్ సుధమ్మను, కడప ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.