Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుఫిర్యాదులపై సత్వరం స్పందించాలి

ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి

స్పందనా లో జిల్లా అదనపు ఎస్.పి.శ్రీ లోసారి సుధాకర్

కడప బ్యూరో

బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ(అడ్మిన్) శ్రీ లోసారి సుధాకర్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్ ) లోసారి సుధాకర్ ‘స్పందన’ కార్యక్రమంలో బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ‘స్పందన’ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
సైబర్ క్రైమ్ బారిన పడ్డ బాధితులు ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ అధికారులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అయన సూచించారు. ప్రజలకు సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఆన్ లైన్ వెబ్ సైట్ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయొచ్చని ప్రజలకు అదనపు ఎస్.పి(అడ్మిన్) సూచించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article