ప్రైవేటు స్కూళ్లలో ‘ఫీ’జులం…
- చదువుకుందాం కాదు కొందాం….
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్నటువంటి వ్యాపారం ఇంకెక్కడ జరగదు,
ఎల్ కేజీ నుండి పదవతరగతి వరకు తరగతికి ఇంత అంటూ ఫీజు వసూలు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజుల రూపంలో పిండుతున్నారు,
స్కూళ్లు ప్రారంభమైన నాటి నుండి టై,బెల్టు,ఫంక్షన్లు అంటూ గుంజుతూనే నేడు పాఠ్యపుస్తకాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు, ఇదంతా సర్కార్కు తెలిసినా ఆయా సంస్థలు నడిపే వ్యక్తుల సైతం పార్టీలో ఉండడంవల్ల మిన్నుకుండిపోతున్నారు, ఫీ…జులుం చేస్తున్నే రకరకాలుగా బాదేస్తున్నారు,
ఇక కార్పొరేట్ స్కూళ్లలో అయితే ఎల్కేజీ పుస్తకాలు 20,000 వరకు ఉంటున్నట్లు సమాచారం,10వ తరగతి ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు,అంత ఖరీదు చేసే పాఠ్యాపుస్తకాలు వేటితో తయారుచేస్తారో మరి, ఇక ఏసీ తరగతి గదులకు ఒక ఫీజు,నార్మల్ తరగతి గదులకు ఒక ఫీజు అంటూ వసూలు చేస్తున్నారు,
దీంతో తల్లిదండ్రుల పుస్తకాలు ధరలు, ఈ ఫీజులు ధరలు చూసి బెంబేలు ఎత్తిపోతున్నా కన్న బిడ్డలు భవిష్యత్తు కోసం తప్పక అనేక తిప్పలు పడినా అప్పులు చేసి మరి కడుతున్నారు, ఏదేమైనాప్పటికీ చదువుకుందాం నుండి చదువుకొందాం అనే కాలంలోకి వచ్చేసాం
మరిన్ని వివరాలు వచ్చే సంచికలో
మత్తెబాబి, ప్రజాభూమి స్పెషల్ కరెస్పాండెంట్ ఏలూరు నుంచి