Sunday, September 7, 2025

Creating liberating content

టాప్ న్యూస్ప్రేమ రెండక్షరాల పదమా…

ప్రేమ రెండక్షరాల పదమా…

*రెండు శరీరాల మధ్య వ్యామోహమా …కామమా..
*సహజీవనం కూడా ప్రేమంటారా…
*ఓ వివాహిత …మరో అవివాహితుడితో ఉంటే ప్రేమేనా..
*తాళి కట్టిన వాడున్నగానే ఇంకొకరితో తిరుగుతుంటే…
*అరవై ఏళ్ల వృద్ధుడుని కూడా ప్రేమలో దింపి..
*ఈ ప్రేమముసుగు పైసల కోసమా…పేరు కొసమా..
*పెళ్లై పిల్లలు ఉన్నా…బజారు కెక్కితే ప్రేమేనా…
*ఇదేనా లైలా మజ్ను చేసింది..
*ప్రేమ ముసుగులో పాడుపనులు చేసిన ప్రేమేనా..
*ప్రేమపేరుతో ఎన్ని తాళి బొట్లు కట్టుకోవచ్చా….
*కన్న తల్లిదండ్రులే కొంపలు కూలుస్తుంటే…
*వీరేమి తల్లిదండ్రులు… ఇదేమి కాపురాలు..
*నాటి ద్రౌపది కి మించి చేస్తున్న నేటి ద్రౌపదెవరు…?
*ఏది ప్రేమ..ఎవరిది వ్యామోహం… ఎవరిది కామం…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)

కామాతురాణాం నభయం నలజ్జ అన్నారు పెద్దలు…కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి సిగ్గు లజ్జ ఉండదన్నది అర్థం..ఇలాంటి పనులు చేసే వాళ్ళు ప్రేమ అనే ముసుగులో చేస్తున్న అరాచకాలకు ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి. లైల మజ్ను లను ఇప్పటికి గొప్ప ప్రేమికులు గా ఆరాధిస్తారు.అయితే ప్రేమలో ఉన్న గొప్పతనం ఆ మాధుర్యాన్ని వీధి కుక్కలుగా తిరిగే వారు కూడా అన్వయించుకుని చెలామణి అవుతుంటే నవ్విపోతుంది ఈ సమాజం.రెండు శరీరాల మధ్య ఉన్న కామాన్ని వ్యామోహాన్ని కూడా ప్రేమ అనే ముసుగు వేసుకుని బజారు పాలు చేస్తుంటే సిగ్గుతో చస్తుంది ఈ సమాజం.భార్య పిల్లలు ఉన్నా ఇంకో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని పట్టుబడితే ,అదే మహిళ ప్రేమ పేరుతో ఇంకొకడితో సహజీవనం చేస్తూ పట్టుబడితే దానికి ప్రేమ అనే అర్థం పలుకుతూ సిగ్గు విడిచి బ్రతుకున్నా కొంతమంది వెధవలను చూసి పక్కున నవ్వుతోంది ఈ లోకం.ఓ వివాహిత తనకు పెళ్లిఒకసారి మాత్రమే అధికారకంగా అయ్యి పిల్లలు ఉన్నా భర్తని నిర్లక్ష్యం చేసి కారులో షికార్లు చేస్తూ ఇంకో వాడితో సహజీవనం చేస్తుంటే… ఆ వివాహిత ఇంట్లో వారే అనేక పెళ్లిళ్లు చేయడానికి సిద్దమై ఎంతటి పాడు పనులు చేసిన సరే అంటుంటే ఈ వింతలు చూసి నాటి ద్రౌపది కూడా సిగ్గు పడే విధంగా పరిస్థితులు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తొంది. ఇన్ని వెధవ పనులు చేస్తూ గొప్పలు చెబుతూ బడాయి మాటలు మాట్లాడే నీచులు కూడా ఇదంతా ప్రేమ అంటే ఇంకేమానాలో మరి అర్థం కాని పరిస్థితి. తామంతా సిద్ధాంతాలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటూ వయస్సు మించిన పనులు చేస్తూ సిగ్గు విడిచి కారులో ఒకరు, రంగానికి ఒకర్ని ఎంచుకుని చిల్లర పనులు చేస్తే కూడా దాన్ని కూడా ప్రేమే అంటారంటా ఈ పనికి మాలిన పెద్దమనిషి,అతగాడికి చప్పట్లు కొడుతున్న సిగ్గులేని వానర సైన్యాన్ని ఏమనాలో ఇంకేమానాలో అర్థం కాని పరిస్థితి. కేవలం డబ్బుకోసం గబ్బు పనులు చేస్తూ సంసారాల ముసుగులో చేస్తున్న పనులు అనేకం వెల్లడి ఆయ్యి పోలీసు కేసులు కూడా నమోదు కాబడి సమాజం సిగ్గుపడేలా ఉంది.మోసపోయిన, ప్రాణాలు పోయిన కుటుంబాలు ఈ నకిలీ మాయగాళ్ల, మాయలేడీ ల వ్యవవహారం పోలీసులకు కూడా సవాల్ గా మారుతుంది.పాచ్ఛాత్య సంస్కృతికి అలవాటు పడి విచ్చలవిడిగా భరి తెగించి తిరుగుతూ కూడా ప్రేమ అనే పవిత్రమైన అర్థాన్ని కించ పరిచే విదంగా ప్రవర్తిస్తున్న ఈ సిగ్గులేని జనాన్ని కూడా పెద్ద మనుషులుగా చూడడం వల్లే లోకం తెలియని ఎంతో మంది ప్రేమ అనే ముసుగులో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువతరం. పైన చెప్పుకున్న సంఘటనలు కేవలం కొన్ని మాత్రమే ఇంకా బోలెడు ఉన్నాయి…ఇప్పటికయినా ప్రేమ అనే పదానికి నిజ మైన అర్థం తెలుసుకుని మనుగడ సాగిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు సమాజ శ్రేయస్సు కోరే పెద్దలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article