టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ప్రియమణి ప్రధానమైన పాత్రగా రూపొందిన ‘భామాకలాపం 2’ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ‘భామాకలాపం’ మొదటి పార్ట్. కొంతకాలం క్రితం పెద్దగా అంచనాలు లేకుండానే మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతసేపు ఇరుగుపొరుగు వ్యవహారాలపై కన్నేసి కాలక్షేపం చేసే ఒక మహిళ, ఎలాంటి సమస్యలను ఫేస్ చేయవలసి వచ్చిందనేది ఈ సిరీస్ కథ. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘భామాకలాపం 2’ వస్తుంది.తాజాగా ఈ సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి భాగాన్ని మించిన త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. ఆహా ఒరిజినల్ గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సీక్వెల్ పై అంచనాలు పెంచుతుంది. ‘భామాకలాపం 2’ చిత్రానికి అభిమన్యు తాడమేటి దర్శకత్వం వహించారు. బంగారు కోడిపుంజు దొంగతనం చుట్టూ ఈ కథ ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ తో ఉండనున్నట్లు ట్రైలర్ అంచనాలను పెంచింది. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంది.