తాడిపత్రి:
తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు అలీ కంటి ఆసుపత్రివద్ద మాన్ హోల్ మూత పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. రద్దీ గా ఉండే పుట్లూరు రోడ్డులో వాహనదారులు, పాదచారులు ఎక్కువగా వెళుతూ ఉంటారు. గమనించకుండా వాహనాన్ని నడిపితే మ్యాన్ హోల్ లో పడితే ప్రాణాలు పైకి పోవాల్సిందే. అధికారులు మ్యాన్ హోల్ మూత వేసి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.