ఏలేశ్వరం:-ప్రమాదం అంచులలో కేబుల్ పనులు నిర్వహిస్తున్నారా అంటే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఓ బడా కేబుల్ కంపెనీకి సంబంధించిన పనులు స్థానికంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యుత్ స్తంభాల పైకెక్కి కేబుల్ వైర్లను అమరుస్తున్నారు. పైన విద్యుత్ వైర్లు నుండి కరెంటు ప్రవహిస్తున్న పట్టించుకోకుండా వారి పనులు వారు చేసుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా వైరు తగిలి ప్రమాదానికి గురైతే దానికి ఎవరు బాధ్యులని స్థానికులు గుసగుస లు ఆడుతున్నారు. ఇదే విషయాన్ని విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియపరిచిన వారు పొంతలు లేని సమాధానం చెబుతున్నారు. కేబుల్ వైర్లు విద్యుత్ స్తంభాలకు అవర్చే ముందు విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంది. కానీ ఈ నిబంధనను తుంగలోనే తొక్కేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానిని విద్యుత్ శాఖపై నెటి వేయడం సర్వ సాధారణమైపోయింది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ సిబ్బంది ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.