వేంపల్లె
2024 –2025 సంవత్సరం సంబంధించి కళాశాల అడ్మిషన్ల కొరకు స్థానిక వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు మరియు అధ్యాపక బృందం సోమవారం అడ్మిషన్ల కొరకు ప్రచార కరపత్రాలను ప్రారంభించారు. అడ్మిషన్లకు సంబంధించి కరపత్రమును సోమవారం కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు ఇతర అధ్యాపకులందరూ పాల్గొని ప్రారంభించారు. తదనంతరం వైస్ ప్రిన్సిపాల్ నాగేంద్ర, చరిత్ర అధ్యాపకులు బాలకొండ గంగాధర్ , లైబ్రేరియన్ మాధవరావు, గణిత శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సుధాకర్ మరియు రాజారెడ్డి సంయుక్తంగా చక్రాయపేట మండలంలోని వివిధ జూనియర్ కళాశాల ను సందర్శించి అడ్మిషన్ల కొరకు ప్రచారం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాలలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ 25 కోట్ల రూపాయలతో నూతన భవనం నిర్మించబడి అత్యాధునిక సదుపాయాలతో వేంపల్లి కేంద్రంగా డిగ్రీ కళాశాల ప్రారంభమవుతున్నదని గ్రామీణ విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాలలో ఎంతో అనుభవంతో పాటు యూజీసీ నిర్దేశించిన పీహెచ్డీ , యుజిసి నెట్ రాష్ట్ర ప్రభుత్వం సెట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారితో కళాశాలలో మంచి బోధనా సౌకర్యం ఉందని వారు విద్యార్థులు తెలియజేశారు. అంతేగాకుండా విద్యార్థులలో పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించే ఎన్ఎస్ఎస్ మరియు క్రీడా రంగాలలో వేంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించిన మూడు సంవత్సరాల లోపల విశ్వవిద్యాలయంలోనూ కడప జిల్లాలోనూ మంచి పేరు సంపాదించిందని ఈ సదవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిందిగా విద్యార్థులకు తెలియజేశారు.

