జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీ నాయకుల సిఫారసులకు పెద్దపీట అవకతవకలకు పాల్పడిన వారి పైన చర్యలు తీసుకోవాలి :ఏఐటీయూసీ
కడప సిటీ :జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అన్ని ఉన్న అర్హులైన వారికి కాకుండా అధికార పార్టీ నాయకుల సిఫారసులకు పెద్దపీట వేసిన నోటిఫికేషన్ రద్దుచేసి తిరిగి నోటిఫికేషన్ నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
గురువారం స్థానిక హోచిమిన్ భవన్ యందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ కడప రిమ్స్ లోని డెంటల్, పులివెందుల మెడికల్ కళాశాల యందు సుమారు 200 పైబడి ఔట్ సోర్సింగ్ నియామకాల నోటిఫికేషన్ ప్రొవిజనల్ లిస్టులో ఉన్న మెరిట్ ప్రాతిపదిక కాకుండా అనర్హులకు పెద్దపీట వేశారని ఆరోపించారు.ఎన్నికలసమయంలో అధికార పార్టీ నాయకుల సిఫారసులకు తలోగ్గి అర్హులైన వారికి అన్యాయం చేసి అర్హత లేని వారికి పెద్దపీట వేశారని ఆరోపించారు.
ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, ఈసీజీ తదితర 26 విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను అర్హులైన వారితో నియామకాలు చేపట్టాలన్నారు.
నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి చేతివాటం ప్రదర్శించిన అధికారులపై జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపించి తగు చర్యలు తీసుకొని నోటిఫికేషన్ రద్దు చేసి,తిరిగి నోటిఫికేషన్ పిలిచి అర్హులైన వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈవిలేకరులసమావేశంలో ఏఐటియుసి అధ్యక్షులు జి. వేణుగోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కెసి.బాదుల్లా, జిల్లా కార్యదర్శి లు మద్దిలేటి, లింగన్న పాల్గొన్నారు.