ఉచిత రాబిస్ టీకాలు వేయించుకోవాలి
శాసనసభ్యులు బాలరాజు
జీలుగుమిల్లి :పశుసంరక్షణ శాఖ – మండల పశు గణన పర్యవేక్షణ కేంద్రం-జీలుగుమిల్లి మండలం లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా చేయించాలి అన్నారు.
అలాగే గత 40 సంవత్సరాలనుండి ఉన్నటువంటి పశు సంరక్షణ శాఖను కనీస మరమ్మత్తులు కి కూడా గత ప్రభుత్వం నోచుకోలేదు అన్నారు. మన ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం లో కచ్చితంగా పశు సంరక్షణ కేంద్రం నీ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. సంబంధిత డిడి తో, ఐటీడీఏ పిఓ తో మాట్లడి త్వరిత గతిన నిర్మాణ పనులు మొదలుపెట్టేలాగా చేస్తమన్నారు.
ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్ , మండల అధ్యక్షులు పసుపులేటి రాము , టిడిపి మండల అధ్యక్షులు సుంకవలి సాయి , పశు సంరక్షణ డాక్టర్స్ ఏ డి హెచ్ సాయిబుచ్చారావు సంబంధిత అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జంతువుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
