న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగర్ సుమారు గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఈ సమావేశంలో చర్చించారు.ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలపై కూడ ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జగన్ చర్చించారని సమాచారం.విభజన చట్టంలోని హామీల అమలుపై కూడ చర్చించారని తెలుస్తుంది. విశాఖపట్టణంలోని ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని కూడ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిపైనే చర్చించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుమారు గంటకు పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ చర్చించారు.