ఒంటిమిట్ట:శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్భంది ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు,టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్రవారం వి వి ఐ పి టీటీడీ సభా భవనంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఈవో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు జరిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసుకుని ముందస్తు ఏర్పాట్లు యాలన్నారు.కల్యాణానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు,తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, విరివిగా అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటర్లలోను, గ్యాలరీలలో ఉన్న భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

భద్రత,శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు,తాగునీరు, అన్నప్రసాదాలు,విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్,ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు,కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు,కల్యాణోత్సవం సందర్బంగా విద్యుదీకరణ అంశాలు,అగ్నిమాపక వాహనం, వైద్య ఆరోగ్యశాఖ వారిచే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు తదితర అంశాల పై సమీక్షించి పలు సూచనలు చేశారు.ఈ ఏడాది భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించినట్లు చెప్పారు.జిల్లా యంత్రాంగం తరపున వివిధ శాఖల అధికారులకు, టీటీడీ తరపున ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వాటిని సమన్వయంతో పూర్తి చేసి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడారు : ఏప్రిల్ 15వ తేదీ లోపు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ఎపిఎస్ ఆర్టిసి ద్వారా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద గ్యాలరీలు, పటిష్టమైన బ్యారికేడ్లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయలన్నారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్ సిబ్బంది, మందులు, అంబులెన్సులు, గ్లూకోజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ చంద్, ఎస్వీబిసి సిఈవో షణ్ముఖ కుమార్, టీటీడీ సిఈ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో నటేష్‌బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

