సుజాత రెడ్డి…
కడప సిటీ :ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ మహిళా అధ్యక్షురాలుగా తన నియమానికి సహకరించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ,మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి, జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాంతీయా కుమారికి కృతజ్ఞతలు తెలిపారు.పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి నాయకత్వంలో మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, నిరుద్యోగులు, కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు షర్మిలమ్మ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంత మొందించి కౌరవ సభ గౌరవ సభగా మారాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
వైకాపా పాలనలో రాష్ట్రం, నగరం అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆమె ధ్వజమెత్తారు. సహజవనురు లను దోచుకున్నారని విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో ఇందిరమ్మ అభయం, కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం, ప్రత్యేక హోదా పాశుపతాస్త్రం. ఇందిరమ్మ అభయం పేదలకు,మహిళలకు కాంగ్రెస్ వరం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు.కాంగ్రెస్ తోనే సాధ్యం. తాను మళ్లీ ముఖ్య మంత్రి కాకపోతే పథకాలు ఆగిపోతాయి అని జగన్ చెప్పడం హాస్యాస్పదం. ప్రస్తుత పథకాలన్నీ కాంగ్రెస్ పాలనలో అమలైన పథకాలేన్నారు.
మైదుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిణిగా దరఖాస్తు చేశానని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే ఘన విజయం సాధించి షర్మిలమ్మకు మైదుకూరు సీటును కానుకగా ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
విలేకరుల సమావేశంలో పాల్గొన్నవారు సంతోషమ్మ, సోనాలి, వెంకటరమణారెడ్డి, అలీ పాల్గొన్నారు.