Wednesday, February 4, 2026

Creating liberating content

టాప్ న్యూస్ప్రజాస్వామ్యమా నీ అడ్రస్ ఎక్కడే…?

ప్రజాస్వామ్యమా నీ అడ్రస్ ఎక్కడే…?

పాడు కూతలు కూసే వాడు ప్రజాప్రతినిధులేనా…
*పార్టీ ఏదయినా ఆ పోరంబోకు కూతలేమిటి..
*ఇదేనా వీరి ప్రజానీతి…
*శాసనసభ లోనూ సిగ్గుమాలిన కూతలు కూసే…
*ప్రజాక్షేత్రం లో పనికిమాలిన ధర్మానికి పాల్పడే…
*ప్రజాప్రతినిధులు అంటే అర్థం పరమార్థం తెలుసునా..
*పరువు తక్కువ కూతలు కూయడం ప్రజాస్వామ్య విఘాతం కాదా…
*ప్రజాస్వామ్య విఘాతకులకు పెద్ద పెద్ద పదవులెందుకు…
*ప్రజా కాంక్ష లేని వాడు రాజకీయ నాయకుడిగా అర్హుడా…
*సంస్కారం తెలియని కుసంస్కారాకి కుర్చీలెందుకు…
*ప్రజలకు కుచ్చు టోపి పెట్టడానిక…
*ఇదేనా మన స్వతంత్ర భారతం…
*దేనికోసం ఇంత రాద్దాంతం..
*రాజకీయ మనుగడ కోసం దిగజారి పోవాల…

  • దేనిని ఉద్ధరించడానికి ఇంత దిగజారిన రాజకీయాలు…
  • ప్రజలకు ఉపయోగపడని పనికిమాలిన ధర్మమెందుకు….
  • ఇలాంటి నాయకులు ఉండిన నేమి మండిన నేమి…
  • ప్రజల మమకారం కోసం అహంకారపు పనులు చేయాలా…
  • ఎవడు నేర్పాడు రా అయ్యా ఈ పనికిరాని రాజనీతి…
  • ఇదేమి బ్రతుకులు రా అయ్యా…
  • చీ..చీ..ఇంత సిగ్గుమాలిన రాజకీయాలు కావాలా ప్రజలకు…
  • ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారా..
  • మీ రాక్షసతత్వంతో రగిలిపోతుందిగా ఈ రాజ్యం…
  • ఓ నేతల్లారా మీ నీతిమాలిన పనులు మానరా…
  • మానవ సమాజాన్ని మని చేయకండి…
  • ఓ ప్రజా స్వామ్యమా ఏమిటీ ఈ మనుషుల తీరు…
    (రామమోహన్ రెడ్డి)

“అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామ దానికి సలాము చేద్దామా
శాంతికపోతపు కొత్తుక తెంచి తెచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ ఓ పవిత్ర భారతమా
కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారె
జనాలు తలలర్పిస్తారె
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లో
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరె తెలిసి భుజం కలిపి రారె
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుర సింధూరం జవాబు చెప్పే భాద్యత మరచిన
జనాల భారతమా ఓ అనాధ భారతమా
అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూరమ్రుగంల దాక్కుని ఉండాల
వెలుగుని తప్పుకు తిరగాల
శత్రువుతో పోరడే సైన్యం
శాంతి ని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణిచే విధిలో
సవాలూ చెయ్యాల అన్నల చేతిలో చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ
సంఘం శిలల నిలుచుంటే నడిచే శవంలా సిగలో
తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్య సింధూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మ
గతి తోచని భారతమా
తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే
వదులుకొని తనలో భీతిని తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాశిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంక నిదురిస్తావ విశాల భారతమ ఓ విషాధ భారతమా”ఆనాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎందుకు చెప్పాడో నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అన్న వారు ఆచరిస్తున్న విధానాలను బట్టి చెప్పవచ్చు.స్వాతంత్ర్యము వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తరువాత కూడా ఎన్నో సమాజహితము హానీ కలిగించే విదానాలు అవలంభిస్తున్న ఈ అజ్ఞానపు రాజకీయ నాయకులు తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందిగా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల శ్రేయస్సు కోసం పరితపించాల్సిన ప్రజాప్రతినిధులు అదే ప్రజలకు అసహ్యం పుట్టే పనులకు ఓడిగడి తుంటే ఇలాంటి పనికిమాలిన ధర్మం కలిగిన ప్రజాప్రతినిధులు ఈ ప్రజలకు అవసరమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజా కాంక్ష మరిచి వీరి కాంక్షకొసం కొవ్వెక్కిన కూతలు కూస్తూ కటకటాల్లోకి వెళ్లి మళ్ళీ వెకిలి చేష్టపు పనులకు ఒడిగడుతున్న వీరిని చూస్తుంటే ఓనమాలు రాని వారు కూడా హవ్వా ఇదేమిటిరా అని ఆశ్చర్యానికి గురైవుతున్నారు.
రాజకీయాలు అంటే ఒక సమాజం, సమూహం లేదా దేశంలో వనరుల పంపిణీ, నిర్ణయాధికారం మరియు పాలనా వ్యవస్థను నిర్వహించే ప్రక్రియ. ఇవి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం, చట్టాలను రూపొందించడం మరియు అధికారంలోకి రావడానికి లేదా కొనసాగించడానికి చేసే పనులు. ఇది వ్యక్తులు లేదా సమూహాల మధ్య ఆధిపత్య పోరు మరియు సమాజ అభివృద్ధికి తీసుకునే చర్యలతో కూడిన క్లిష్టమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యంతో నడిచే ప్రక్రియ. అయితే నేడు నవ్యాంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు శ్రుతిమించి ఏకంగా వినూత్న నిరసనలకు దారితీస్తున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పెరిగిపోవడం వల్ల ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల కార్యకర్తలు భావోద్వేగాలకు లోనవుతున్నారని, అది ఇలాంటి వింత నిరసనలకు దారితీస్తోందని పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, అవి హుందాగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి రాజధాని లేకపోయినా,ఆంద్రప్రదేశ్ ను అన్నపూర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చే అపర సంజీవిని లాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేని నేటి రాజకీయ నాయకులు అధికారం లో ఉన్నవారు ప్రతిపక్ష పార్టీపై పరిధి దాటి ప్రవర్తిస్తున్న ఆనవాయితీ అతి కొద్దికాలంగా శృతి మీరి పోయిందని చెప్పక తప్పడం లేదు.
ఆశాస్త్రీయంగా విభజించబడ్డ ఆంధ్రలో అనేక ప్రాంతాలలో అభివృద్ధి కి నోచుకోనివి ఉన్నాయి.నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనుభజ్ఞుడైన నాయకుడు కావాలని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక కాబడి అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేయాలన్న టిడిపి కి2019లో భారీ ఓటమి చూడక తప్పలేదు. ఆ తరువాత పాదయాత్ర ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొని అధికారం లోకి వచ్చిన వైసీపీ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘోర పరభవాన్ని మూటగట్టారు.ఇక విమర్శలు ప్రతివిమర్శలు అనేవి దేవాలయం లాంటి పవిత్రమైన అసెంబ్లీలో కూడా అపవిత్రం అయ్యేలా చేయగలిగారు.ఇవన్నీ కాకుండా కాకుండా విచారణ పేరుతో ఒక ప్రత్యేక రాజ్యాంగం సృష్టించి రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టించబడ్డాయి.నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్న తీరుగా నాడు వైసీపీ నేడు కూటమి పార్టీలు ఒకరినొకరు తీసిపోని విదంగా ఈ రాష్ట్రం అప్రజాస్వామిక విదంగా తయారు కావడానికి ఎవరు తగ్గేదెలా అన్న విధాన తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి.ఫలితంగా ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారిందనే పరిస్థితి నెలకొన్నదని చెప్పాల్సి వస్తోంది.ఇక రివర్స్ టెండర్లు పేరుతో వైసిపి ఆనాటి టీడీపీ ప్రభుత్వం పై అనేక ఆరోపణలు కేసులు బనాయించి ఏకంగా నారాచంద్రబాబు నాయుడుని కూడా జైలు పాలు చేయడం జరిగింది.ఇప్పుడు కూటమి ఏర్పాటు అయ్యాక ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన టీటీడీ లడ్డు పై కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే వైసీపీ ప్రబుత్వం లో టీటీడీ పర్చేజ్ కమిటీలో ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ప్రస్తుత గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లు కూడా ఉన్నారు.వీరి మీద ఇప్పుడు ఎలాంటి విచారణ గాని ఆరోపణలు గాని లేవు.ఏ రాజకీయ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీల పై దుమ్మెత్తి పోయడం సాదారణమే.కానీ నేటి రాజకీయ పార్టీలు తమ విచక్షణ ను కోల్పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ కి విఘాతం కలిగించే లా చేస్తున్నాయి.ఒక నాడు ఫ్యాక్షన్ తో ఎవరి తల తెగిపడిపోతుందో ఎవరి బాంబులు, తుపాకులు పెళతాయో పరిస్థితి ని సైతం పోలీసులు సమూలంగా తుడిచిపెట్టుకొని పోయేలా చేసాయి.కానీ నేడు పోలీసు వ్యవస్థ పూర్తిగా రాజకీయ పార్టీల కబంధ హస్తాల్లో బందించబడిందనేది నిత్య సత్యం గా నిలుస్తుంది. అందుకు నాడు నేడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే సజీవ సాక్ష్యాలు గా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ప్రజాస్వామ్యం అనేది ఉందా ఉంటే అది ప్రజలకు చేరువ అవుతుందా అనే సందిగ్దత నెలకొన్నదని మెజార్టీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article