గోపాల్ ఫౌండర్ గోరుముచ్చు గోపాల్ యాదవ్
కామవరపుకోట :ప్రజాక్షేత్రంలో ప్రజలకు అండగా ఉండేటందుకు కోసం వైఎస్ఆర్సిపికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గోపాల్ ఫౌండర్ గోరుముచ్చు గోపాల్ యాదవ్ అన్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి జనరంజక పాలన చేస్తున్నారని వాటి యందు ఆకర్షితుడై తాను వైఎస్ఆర్సిపి లో జాయిన్ అవుతున్నట్లు చెప్పారు.
ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో వై.యస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గొరుముచ్చు గోపాల్ యాదవ్ .
జగన్ సంక్షేమానికి తోడు జెట్టి రాకతో కొంత ప్లస్ కాగా, ఇప్పుడు గోరుముచ్చు రాకతో చింతలపూడి నియోజకవర్గంలో మన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కంభం విజయరాజు గెలుపు కోసం కష్టపడతాను అన్నారు. రానున్న ఎన్నికలలో మరింత సులభం అవ్వడమే కాకుండా 2019 కంటే మెజారిటీ పెరిగే అవకాశాలు పుస్కలంగా ఉన్నాయని అన్నారు.
దానికి తోడు మేనిఫెస్టో రిలీజ్ అయితే సర్వేల్లో వచ్చిన సీట్లు కంటే ఎక్కువే గెలిచే అవకాశాలు ఉండడమే కాకుండా, 2024 లో ముఖ్యమంత్రి అయితే ఇక వరుసగా 2029, 2034 లో వెనక్కి చూసుకునే పనే ఉండదు అని గోపాల్ జోష్యం చెప్పారు.
మేనిఫెస్టో మార్చడంతో పాటు ఈ సంక్షేమము, అభివృద్ధి చేస్తూనే పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకునే కార్యక్రమం కచ్చితంగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ సారి దాని ఫోకస్ పెడతానని ఆయన భరోసా ఇచ్చారు. చింతలపూడి నియోజకవర్గంలో పాటు ఏలూరు జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో తన సన్నిహితులతో క్యాంపెయిన్ నిర్వహించడానికి ఎప్పటికీ ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.