పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగానికి పెనుభారం వంటిదని కాగ్ తన తాజా నివేదికలో పేర్కొంది.కాగ్ నివేదిక నేపథ్యంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని, నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితమవుతోందని షర్మిల ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేడని స్పష్టం చేశారు. షర్మిల తన ట్వీట్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ 2022 అక్టోబరు 21న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీసీ ముర్ముకు సాక్ష్యాధారాలు సమర్పించినప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతమాత్రం ఆచరణ సాధ్యం కాదని ఇప్పుడు కాగ్ నివేదిక చెబుతోందని షర్మిల పేర్కొన్నారు.