ఆర్ అండ్ బి ని నమ్ముకుంటే ప్రజల ప్రణాళిక ముప్పే అత్యంత ప్రమాదకరంగా ఏలూరు రోడ్డుపై స్వరంగం.. ఏలూరు ఎస్ పి మేడం ఆదేశంతో పనులు పూర్తి
కామవరపుకోట :కామవరపుకోట మండలం ఉప్పలపాడు గొల్లగూడెం మధ్యలో ఏలూరు జంగారెడ్డిగూడెం వెళ్లే రోడ్డు పై ప్రమాదకరస్థాయిలో రోడ్డు మార్జిన్ కొట్టుకుపోయింది. గతంలో కురిసిన ఒకే ఒక రోజు 203 మిల్లి మీటర్లు కు ఈ రోడ్డు కొట్టుకుపోయింది .ప్రతిరోజు ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యం తిరుగుతూనే ఉంటారు కానీ అటువైపు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో మోటారు సైకిళ్ళు సైకిళ్ళు వాహనదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు.పొరపాటున ఆర్టీసీ బస్సులు గాని ఏవి వాహనాలు గాని మార్జిన్ అంచుకు వస్తే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఆర్ అండ్ బి అధికారులకు తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొంది.

ఏలూరు జిల్లా ఎస్పీ మేడం మన పోలీసులతో ఎటువంటి ప్రమాదం స్థంభవించకుండా ముందస్తుగా ఆ ప్రదేశం మార్జిన్ లో మరమత్తులు చేస్తే ఎన్నో ప్రాణాలను ముందుగా కాపాడిన వాళ్ళం అవుతాము అని తడికలపూడి పోలీసులకు ఆదేశించారు. దీంతో తడికలపూడి ఎస్ఐ జయ బాబు స్థానికుల సహకారంతో జెసిబి మిషన్తో రోడ్డును మార్జిన్ పూర్తి చేశారు.ఆర్ అండ్ బి వారిని నమ్ముకుంటే మార్జిన్ పనులు పూర్తి కావు అని పలువురు విమర్శలు గుప్పించారు. ఏది ఏమైనా పోలీస్ అధికారులు రోడ్డు మార్గంలో బాగు చేయడంతో పలువురు అభినందనలు గుప్పిస్తున్నారు. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ లోని పలుచట్ల పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి వాటిలో కూడా పూర్తి చేస్తే పోలీసులకు సాల్యూట్ అంటూ ప్రజలు అభినందిస్తున్నారు.