అరిగిలవారిపల్లెలో ఉచిత మెడికల్ క్యాంపులో-డా-ప్రనీత్ రెడ్డి..

చంద్రగిరి:ప్రజల ఆరోగ్యమే తమ హాస్పటల్ లక్ష్యమని శ్రీబాలాజీ మెడికల్ కాలేజ్,హాస్పిటల్, పరశోదన కేంద్రం మెడికల్ డైరెక్టర్ ప్రణీత్ రెడ్డి అన్నారు.ఆదివారం చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లెలో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో అరిగిలవారిపల్లెలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.ఈ మెడికల్ క్యాంపులో పంచాయతీలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ప్రజలు ఎత్తున పాల్గొన్నారు. వివిధ ఆరోగ్య సమస్యల ద్వారా అనేకమంది వైద్య సేవలు ఉపయోగించుకోవడంతోపాటు సుమారు40 మందికి వివిధ రకాల టెస్టులు నిర్వహించేందుకు సోమవారం కాలేజీ బస్సు వస్తుందని అందులో వస్తే వీరందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సేవలను అందిస్తామన్నారు.ఇందులో ఎవరైనా ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిందే ఆరోగ్యశ్రీ ద్వారా చేర్చుకుంటామన్నారు.టెస్టులను సైతం ఉచితముగానే నిర్వహిస్తామన్నారు.మీ గ్రామంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తమ ఆసుపత్రికి 24 గంటలు అందుబాటులో ఉంటుందని తీసుకురావచ్చుఅన్నారు.అందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలను,వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఉచిత మెడికల్ క్యాంపులో బిపి,షుగర్,వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను,టానిక్ లను అందజేశారు.ఈ కార్యక్రమంలో డా.లహరి, స్థానికులు బొజ్జ వెంకటరత్నం, దలవాయి మణి యాదవ్,పానేటి చెంగల్రాయులు,నాగభూషణం, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్,హాస్పిటల్, పరిశోధన సిబ్బంది పాల్గొన్నారు