జగ్గంపేట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. జగ్గంపేట మండలం జె. కొత్తూరు గ్రామంలోని కరుటూరి వీర్రాజు తన రైస్ మిల్లు లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నరసింహం పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వీర్రాజు ను ఆత్మీయంగా కలుసుకునేందుకు రావడం జరిగిందన్నారు. మొన్న దెందులూరు లో సిద్దం సభ విజయ వంతమైందన్నారు. ఎన్నికలు ఇంకా రెండు నెలలు ఉండగా ప్రజలు అత్యధికంగా సభకు వచ్చారన్నారు. నియోజకవర్గం నుండి సుమారు 90 బస్సుల్లో, వివిధ కార్లలో సభకు వెళ్ళడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తోటరాంజి , అత్తులురి సాయిబాబు, ఒమ్మి రఘురాం ,కరటూరి శ్రీను ఎస్.కె గపూర్ గుల్ల ఏడుకొండలు , జాన్ వెస్లీ , పాము సూరిబాబు , రామకుర్తి జగాలు ,సప్పా రఘునాథ్, భూమాడ గణపతి, మలిరెడ్డి పాపారావు,సూరిమిల్లి సూరిబాబు ,తదితర నాయకులు పాల్గొన్నారు.