పులివెందుల :పులివెందుల మున్సిపాలిటీలోని ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయరాదని మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ప్రజలకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు వీధులలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ముద్దనూరు రోడ్,జూబ్లీ బస్టాండ్ దగ్గరున్న పెద్దకాలువ పరిశీలిం చి అక్కడ కాలువనందు చెత్తని వేయకుండా ఒక కంచెని ఏర్పాటు చేసి అక్కడ పడుతున్న చెత్తని ఎప్పటికప్పుడు తొలగించేలా ఏర్పాటు చేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు, అనంతరం గోపీవీహార్ స్ట్రీట్ లోని పెద్ద కాలువను సందర్శించి తర్వాత చిన్నన్న రూమ్ ల నందు ఇంటింటి తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని పుర ప్రజలకు అవగాహన కల్పించి,చెత్తని బహిరంగంగా వేయకూ డదని వార్డు నందు పర్యటించి అవగాహనా కల్పిం చాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. అనం తరం జండామాను వీధినందు రోడ్ పై ఉన్న గుంత ని పూడ్చివేసి మరమ్మత్తు చేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు, అనంతరం తడి, పొడి చెత్తలను అన్లోడింగ్ పాయింట్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ సురేంద్ర, శాని టరీ ఇన్స్పెక్టర్ మురళీధర్ , ఏఈలు పవన్,ఏక్నా థ్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.