అనంతపురము
పోలీస్ డైరీ-2024ను జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. పోలీసులకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగి ఉన్న ఈ డైరీ రోజువారీ దైనందిన కార్యకలాపాలలో పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ అన్నారు. అలాగే, ఈ పోలీస్ డైరీ రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్. విజయ భాస్కర్ రెడ్డి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, శివ ప్రసాద్, వెంకట రమణ, సరోజ పాల్గొన్నారు.

