కూనవరం: కమ్యూనిటీ బిల్డ్ ప్రోగ్రాంలో భాగంగా ఆదివారం కూనవరం మార్కెట్ సెంటర్ లో, విఆర్ పురం మండలం రేఖపల్లి వద్ద యువత గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని యువతలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కూనవరం ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత చెడు అలవాటుకు దూరంగా ఉండాలని విద్య ఉపాధి పై దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూనవరం విఆర్ పురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

