జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
కడప బ్యూరో
జిల్లాలోని అన్నింపోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల సంసిద్ధతతో పాటు.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి రెవెన్యూ, మూడవ దశ రీసర్వే, ఇనామ్ & అసైన్డ్ భూములు, పీఆర్ అండ్ ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎస్, జల్ జీవన్ మిషన్, పేదలందరికీ ఇల్లు – పట్టాలు – రిజిస్ట్రేషన్, వైద్యఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎన్నికల సన్నద్ధత, తదితర అంశాలపై.. అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు, జేసీ గణేష్ కుమార్, డీఆర్వో గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూష పాల్గొన్నారు.
సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం సంబందిత శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలను మరోసారి తనిఖీ చేసి వసతులను సమకూర్చాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సాధారణ భద్రతా ఏర్పాట్లు, సదుపాయాలు సరిగా లేని చోట్ల వెంటనే సంసిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుగా తీసుకెళ్లేందుకు ఆయా శాఖల ద్వారా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ సుధాకర్ రెడ్డి, హౌసింగ్, డ్వామా పీడిలు కృష్ణయ్య, యదుభూషన్ రెడ్డి, పీఆర్ ఎస్.ఈ. శ్రీనివాసులు రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. వీరన్న, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఉమామహేశ్వర కుమార్, ఆరోగ్యశ్రీ డిసి డా. బాలాంజనేయులు, డిసిహెచ్ఎస్ డా.హిమదేవి, రెవెన్యూ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.