Wednesday, May 7, 2025

Creating liberating content

తాజా వార్తలుపేదల పాలిటి పెన్నిధి ఏనుగుల పుల్లయ్య15 వ వర్ధంతి కార్యక్రమం

పేదల పాలిటి పెన్నిధి ఏనుగుల పుల్లయ్య15 వ వర్ధంతి కార్యక్రమం

మార్కాపురం

పట్టణంలోని స్థానిక కోర్ట్ సెంటర్లోనీ పోస్టాఫీసు వద్ద గల ఆయన విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ షేక్ సుభాని మాట్లాడుతు
పోస్టల్ ఉద్యోగానికి తగిన న్యాయం చేస్తూ, పోస్టల్ యూనియన్ ద్వారా ఉద్యోగుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేశారన్నారు ఏపియూడబ్ల్యుజే రాష్ట్ర నాయకులు నూకని వెంకటరమణమాట్లాడు తూ తాను ముసలివారైనా కళాశాల విద్యార్థుల సమస్యలపై తమతో కలిసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాల్లో ముందుండి నడిపించారు. తనకు వచ్చే పెన్షన్ కొంత భాగం తన వెంట నడిచిన విద్యార్థుల చదువులకు తోడ్పాటు అందించేందుకు వెచ్చించారు. మిగిలిన భాగాన్ని పార్టీ కార్యక్రమాల కోసం యూనియన్ల నిర్వహణ కోసం వెచ్చించేవారన్నారు.
సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ తన పోస్టల్ ఉద్యోగానికి ఏడు సంవత్సరాలకు ముందుగానే 1985 లో రాజీనామా చేసి (వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి) మార్కాపురం డివిజన్లోనే ప్రజాశక్తి పేపర్ లో ప్రధమ విలేఖరిగా చేరారు. అలాగే మార్కాపురం డివిజన్లోని అన్ని వసతులతో మండలాలతో పాటు, కందుకూరు డివిజన్లోని తర్లుపాడు మండలంలో కూడా ప్రజాశక్తి విలేకరులను ఏర్పాటు చేసుకొని ప్రజాశక్తి పేపర్ అన్ని మండలాల్లో వెళ్లేలా కృషి చేశారు. మిగిలిన సమయంలో తన వద్దకు వచ్చిన కష్టజీవుల సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు
నాగులవరం రోడ్డులోని దాదాపు 1998లో 42 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. 1999లో దోర్నాల పట్టణంలో ఏర్పాటు చేసిన సుందరయ్య కాలనీలోని వందలాది పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించి అక్కడి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. తదనంతరం నివాస స్థలం లేని పేద ప్రజలందరితో కలిసి మార్కాపురం పట్టణంలో భగత్ సింగ్ కాలనీ, సుందరయ్య కాలనీ, రాజ్యలక్ష్మి నగర్, ఒంటెద్దు బండ్ల కాలనీలను ఏర్పాటు చేసి దాదాపు 3,000 మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించారు. ఇలా విద్యార్థులలో, ఉద్యోగులను, పేదప్రజలలో మంచి స్థానం సాధించారు. సిపిఎం పార్టీని మార్కాపురం రెవిన్యూ డివిజన్లోని 12 మండలాల్లో , కందుకూరు రెవిన్యూ డివిజన్ లోని తర్లుపాడు మండలంలో కూడా పార్టీని, సంఘాలను పటిష్టపరిచారు. అనేకమంది నాయకులను కార్యకర్తలను తయారు చేశారు.
మాజీ డివైఎఫ్ఐ నాయకులు గాయం వెంకటనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులను, కూలీలను ప్రజలను సమీకరించి మార్కాపురం ప్రాంత ప్రజల ఆశాకిరణమైన వెలుగొండ ప్రాజెక్ట్ కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు. సిపిఎం మార్కాపురం మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య మాట్లాడుతూ రిక్షా యూనియన్, ముఠా వర్కర్స్ యూనియన్, పలకల ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్, పోస్టల్, ఎల్ఐసి, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, వీఆర్వో, మున్సిపల్, ఉపాధ్యాయ, అంగన్వాడి, ఆర్టీసీ ఎస్.డబ్ల్యూ.ఎఫ్ వంటి ఉద్యోగుల యూనియన్ లను ఏర్పాటు చేసి వారి సమస్యలపై నేనున్నానంటూ ఉద్యమించి పరిష్కరించేవారన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు వేసపోగు సుదర్శన్* మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పేదలను కూడగట్టి అనేక ఉద్యమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ నాయకులు చెన్నకేశవులు,సిపిఎం నాయకులు డికేఎం రఫీ, ఏనుగుల సురేష్ కుమార్, పీ రూబెన్, జవ్వాజి రాజు, కాశయ్య, విక్టర్, కట్టా సుబ్బారావు, తగరపు నాసరయ్య, జన విజ్ఞాన వేదిక నాయకులు ఏనుగుల రవి కుమార్, ఏనుగుల సాయి, యస్ ఎఫ్ ఐ నాయకులు ఏనుగుల శివ, కొండయ్య, ప్రజాశక్తి దినపత్రిక విలేకర్లు వెన్న శ్రీనివాసరెడ్డి, అల్లు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article