పేదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం బద్వేల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ జ్యోతి
పోరుమామిళ్ల:
పోరుమామిళ్ల మండలంలోని మార్కాపురం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ జ్యోతి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పేదల అభివృద్ధి కోసం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా షర్మిలారెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.. ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుకు రెండు లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు 8333 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని గ్యాస్ సిలిండర్ కేవలం 500 కే అందిస్తామన్నారు.. పింఛన్ 4000 రూపాయలు, వికలాంగులకు 6000 మొదలైన సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. షర్మిలారెడ్డి ని ఎంపీగా గెలిపిస్తే రాజశేఖర్ రెడ్డి తరహాలో కడప జిల్లాను అభివృద్ధి చేస్తుందన్నారు. బద్వేల్ నియోజకవర్గం లో తనదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అన్వర్, సిపిఐ నాయకుడు పీరయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.