ప్రజా భూమి తొండూరు :
తొండూరు ఉన్నత పాఠశాలలో 2003-04 విద్యా సంవత్సరంలో పదవతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం కృష్ణారెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది, విద్యార్థులు ఆనందంగా జరుపుకున్నారు. మధురమైనది స్నేహబంధం మరపురానిది స్నేహబంధంసృష్టిలో అన్నిటినీ మించి
అందరిని అలరించే బంధం
స్నేహబంధం అంటూ మన మంతా ఒక్కటే అనే విధంగా సాగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మనుషులు వీడి రెండు దశాబ్దాల పైన గడిచింది
మనసులు అప్పుడప్పుడు
కలుసుకున్నా కానీ
మనుషులు కలవాలని
కలపాలని కోరిన వేదిక
ఆత్మీయ సమ్మేళన వేదిక
స్నేహితుల కొలువు
ఈవేదిక, ఎవ్వరు ఏ స్థితిలో ఉన్నా ఎవ్వరు ఏ గమ్యం చేరినా
కలిమిలోనైనా లేమిలోనైనా
కలకాలం కలిసుందామని
ఒకరికొకరుచెప్పుకునే రోజు
ఈ రోజు
ఇదే…ఇదే…
పూర్వ విద్యార్థుల
ఆత్మీయ సమ్మేళనం..
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించుకుని సంబరపడ్డారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ నవ్వుల సంద్రంలో మునిగి తేలారు. పెద్దలంతా పిల్లలుగా మారి సందడి చేయడం గురువులను కూడా సంతోష పెట్టినారు