లేపాక్షి: మండల పరిధిలోని పులమతి ,సిరివరం, మద్దిపి గ్రామాల్లో హిందూపురం రూరల్ సి ఐ ఈరన్న ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో మార్చి ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన అనంతరం హిందూపురం రూరల్ సీఐ ఈరన్న మాట్లాడుతూ, ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. ఎవరికి ఓటరు భయపడాల్సిన పని లేదన్నారు. ప్రలోబాలకు ఓటరు లొంగవద్దన్నారు. ప్రజలకు పోలీసులు రక్షణ కవచం లాగా ఉంటారన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు ఎలక్షన్ కమిషన్ అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి ఎస్సై గోపి తో పాటు కేంద్ర బలగాలు, పోలీసులు పాల్గొన్నారు.