హిందూపురం టౌన్ :పురాతనమైన భాషలు ఎంతో మధురమైనవని పావగడ కు చెందిన జపానంద స్వామీజీ పేర్కొన్నారు. ఆదివారం హిందూపురం పట్టణంలోని కే హెచ్ ఫంక్షన్ హాల్ లో ఎనిమిదవ కన్నడ సాహిత్య సమ్మేళనం జరిగినది .ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మడకశిర టీచర్ డాక్టర్ శివన్న వ్యవహరించగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పావగడ జపానంద స్వామి మాట్లాడుతూ, కన్నడ ఉళిసి కన్నడ బళిసి, కన్నడను కాపాడాలని , పురాతనమైన భాష అని మధురమైన తీయనైన భాష అని తెలిపారు .ఈ కార్యక్రమంలో కన్నడ సాహితీ పరిషత్ అంజన్ కుమార్ ,శ్రీనివాస్ శెట్టి గడినాడు కన్నడిగులపై, కన్నడ విశిష్టతపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఎంఈఓ గంగప్ప మధురమైన కన్నడ పాటలను ఆలాపించారు. అదేవిధంగా సరిహద్దులో కన్నడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సమస్యల గురించి ఎంఈఓ వివరించారు.ఈ కార్యక్రమంలో వలస తిప్పే స్వామి ,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

