*సిటీ ప్లానర్ గారు ఈ చిత్రాల మాటేమిటో…
*మురళీ గౌడ్ ముడుపులే ముఖ్యమా…!
*నేతాజీ మాటలు చేతల్లో నీతి లేదంటరా..
*అంతా ప్లానింగ్ సెక్రటరీ సాయి మహిమలే చూడాల్సిందేనా ..?
*పెద్ది ప్రసాదం బాగా వంట బట్టినట్లేనా…
*మేయర్ సిఫార్సు ఉంటే ఎన్ని మేడ లైన కట్టచ్చా…
*నగర ప్రధమ పౌరురాలే పొరపాట్లు చేస్తున్నారా…
*కార్పోరేటర్ ల అవినీతి కి అడ్డే లేదా…
*బ్రోకర్ భార్గవే బిల్డింగ్ ప్లాన్ లిస్తాడా… ఇప్పిస్తాడా…
*పశ్చిమనియోజకవర్గములో ఇంత పద్ధతి లేని అధికారులున్నారా…


- వీరంతా కార్పొరేషన్ ను కాపడుతున్నారా…కాజేస్తున్నారా…
- కూటమి ప్రభుత్వం ఇలా అయితే కుదేలుకాక తప్పదుగా…
- ఎమ్మెల్యే సుజనాచౌదరి కూడా చూస్తూనే ఉంటారా…
- ఇన్ని అక్రమాలు చేస్తుంటే ఆశాఖ అధికారులు అమ్యామ్యా అంటున్నారా…
- ఈ అధికారుల కక్కుర్తి తో కార్పొరేషన్ కంపు కొట్టదా..
- పురపాలక లో ఇన్ని పొరపాట్లు ఉంటే పట్టించుకోరా…
- లంచాల కోసం ఇంత నీచానికి దిగజారి పోతారా…
- బెజవాడ కార్పొరేషన్ ను కాపాడేవారే లేరా…
- ఈ అవినీతి అధికారులకు అండగా …దండుగా ఉన్నదెవరూ…ఉండేదేవరు
(రామమోహన్ రెడ్డి)
లంచం… లంచం…లంచం ఇది ముమ్మాటికీ ఇచ్చి తీరాల్సిందే.అయితే రూటు మాత్రం మారింది.ఒకప్పుడు కేవలం కొంతమంది అధికారుల వరకే పరిమితం అయ్యి ప్లానింగ్ ఉన్నా లేకున్నా మేమున్నామంటూ కార్పొరేషన్ అధికారులు, ఇటు కార్పోరేటర్లు కుమ్మక్కై నీకింత నాకింత అని దోచుకుని దాచుకుని ఇదేమిటని ప్రశ్నించిన, ప్లాన్ వివరాలు అడిగినా కొంతమందికి నెలవారి ఫ్యాకేజీలు ఇస్తూ గిట్టని వారిపై పుకార్లు షికార్లు చేయిస్తూ ఉండేవారు.నాటి నుండి నేటి వరకు కూడా జర్నలిజం ముసుగువేసుకున్న యర్నలిస్టులను మరికొంత మందితో చీకటి ఒప్పందాలు పెట్టుకుని ప్లాన్ అనుమతి కొరకు అప్లికేషన్ రాగానే అడిగినంత ఇస్తే ఓకే లేదంటే చెట్టుపేరు చెప్పి కాయలమ్మిన చందాన వారి పేరు వీరు చెప్పి తమ కు కావల్సిన రాబడి వచ్చేలా చేసుకోవడం గత ప్రభుత్వ హయాం నుండి పరిపాటిగా మారిందనేది జగమెరిగిన సత్యం. కానీ నేడు లంచాలు మాములే కానీ రూటు మారింది.అవినీతి స్వభావం రూపం మార్చుకుని రూపాయిని చక్కగా రాబట్టుకుని అడ్డగోలు ప్లాన్ లిచ్చేస్తున్నారు.ఇదంతా ఎక్కడ అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ లో ఒకటి అయిన విజయవాడ పురపాలక సంఘం లో పట్టణ ప్లానింగ్ విభాగంలో ప్లాన్ ల మంజూరు పక్కాగా పక్కదోవ పడుతున్నాయని చెప్పడానికి ఏలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఒన్ టౌన్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కు ఇచ్చిన అనుమతులను చూస్తే అట్లే అర్ధమవుతుంది.చలమరాజు వారి వీధి స్ట్రీట్ డోర్ నెంబర్ 11-32-34 ,చలువా బసవయ్య వీధి,వట్టూరి వారి వీధి,అలాగే 46 వడివిజన్ రాజీవ్ శర్మ నగర్,53వ డివిజన్ పాపయ్య నాయుడు వీధి,వన్ టౌన్ పులి పాటి వారి వీధి ఇలా సాధారణ పరిశీలన మాత్రమే వెలుగులోకి వచ్చినవి.వాటితో పాటు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 43 డివిజన్ ,45 డివిజన్, చిట్టినగర్ ఇలాప్రతి డివిజన్ లో సరైనా ప్లాన్ లేకుండా కార్పొరేషన్ నుంచి తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోకుండా అనేక నిర్మాణాలూ చేపట్టిన ప్లానింగ్ సెక్రటరీ ,సచివాలయ సిబ్బంది, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లు ,టిపిఓ లో ఇలా అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఆఖరికి సిటీ ప్లానర్ కు కూడా పర్యవేక్షణ లేకుండా చేస్తూ పురపాలక కమిషనర్ ను కూడా బధనాం చేసే విదంగా కింది స్థాయి అధికారులు చెలామణి అవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక పోతే గత అవినీతి తిమింగలం జీతం కూడా లేకుండా పెన్ పవర్ కలిగి వందలాది అక్రమ నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి అక్రమ సంపాదన కు బ్రోకర్ భార్గవ్ లాంటి గ్యాంగ్ తో తన అవినీతి గత సిటీ ప్లానర్ ప్రసాద్ తో కలిసి దోచుకున్న గంధం ప్రసాద్ ప్రధాన అనుచరుడు బ్రోకర్ భార్గవ్ దే కార్పొరేషన్ ప్లానింగ్ విభాగంలో హవ్వా కొనసాగుతుందని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్న కట్టడి చేయలేని స్థితిలో కార్పొరేషన్ కమిషనర్, ప్లానింగ్ చీఫ్ సిటీ ప్లానర్ ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తుంటే కార్పొరేషన్ ప్రజలు ఈ అవినీతి కంపు కడిగేవారెవరో అన్న ఆలోచనలు చేస్తున్నారు.ఇక ఆయా డివిజన్ పరిధిలో ప్రజలకు కార్పొరేషన్ నుంచి అందవలసిన సౌకర్యాలు కానీ ఇతర ప్రజాసమస్యలపై పరిష్కరించాల్సిన కార్పొరేటర్ లే అక్రమ కట్టడాల వెనుక అండగా ఉండి దండుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో నగర ప్రధమ పౌరురాలు కూడా అక్రమ కట్టడాల విషయంలో చొరవ చూపినట్లు గతంలో ఆరోపణలు రాగా వారి ప్రభుత్వ హయాంలో మేయర్ సీటు ఆశించి నగరానికి చైతన్యం తీసుకు రావాలని అనుకుని బంగపడ్డ మహిళా కార్పొరేటర్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఆ తరువాత సర్దుబాటు చేసుకున్నారని అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు 46 డివిజన్ లో రాజీవ్ శర్మ నగర్ లో భారీ అక్రమ నిర్మాణం వెనుక మేయర్ అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇక్కడ ప్రధాన అంశమేమిటంటే భవానిపురం టిపిఓ గంధం ప్రసాద్ పదవి విరమణ చెందిన అతని అవినీతి ఆనవాళ్ళు పోయాయని అనుకుంటే అంతకంటే ఎక్కువ గానే మురళీ గౌడ్ అనే అధికారి అక్రమ నిర్మాణాల విషయంలో అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.ఈయన పనిచేసిన తాడిగడపలో కూడా అక్రమ నిర్మాణాలకు అనేక అనుమతులు ఇచ్చినట్లు వాటిపై విజిలెన్స్ విచారణ కూడా జరుగుతున్నట్టు తెలిసింది.ఆయినా ఆ అధికారి పంథా ఏ మాత్రం మారలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్లానింగ్ సెక్రటరీ సాయి మహిమలు అనేకం ఉన్నట్లు నేతాజీ మాటల్లో ఉన్న నీతి అక్రమ నిర్మాణాల విషయంలో పాటించడం లేదని బ్రోకర్ భార్గవ్ ఏది చెబితే అదే చేస్తూ సంచులు నింపుకుని,నింపే ప్రయత్నం లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగితాల ప్రసాదం బాగా ఇస్తూ పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టే పెద్ది ఆయా ప్రాంత అధికారులకు పెద్ద స్థాయిలో ప్రసాదం పంపిణీ చేసి తన అక్రమ నిర్మాణాలను యథేచ్ఛగా నిర్మిస్తూ కార్పొరేషన్ కు గండి కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా వాటిని పట్టించుకునే నాధుడు కరువయ్యారు.గత చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో బాగా ప్రసాదాలకు ప్రాధాన్యత ఇచ్చిన అనేక సంఘటనలు వెలుగులోకి రావడం తో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చర్యలతో ఆ ప్రసాదం బదిలీ అయ్యాడని అనుకుంటే ప్రస్తుత చీఫ్ సిటీ ప్లానర్ వారందరి అవినీతి ని మరిపించేలా ఉందనే బలమైన ఆరోపణలు వినపడుతున్నాయి.ఇలా కింది స్థాయి నుంచి ఇన్ని రకాల అవినీతి జరుగుతున్నా కమిషనర్ పట్టించుకోకుండా ఉన్నారంటే ఆయన్ని కూడా ఈ అవినీతి కంపులో భాగస్వామ్యం చేస్తున్నారా అన్న అపవాదు ఐఏఎస్ అధికారులకు కూడా అంటగట్టే స్థాయికి పరిస్థితులు దాపురించాయని కార్పొరేషన్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెజవాడ కార్పొరేషన్ ఆవినీతి కంపు కడిగేవారెవరో అన్న ధర్మ సందేహం వ్యక్తం అవుతోంది.


